బీఆర్ఎస్ ఓటమికి 10 కారణాలు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హ్యాట్రిక్ కొడతామని బీరాలు పలికి.. సంబురాలకు రెడీగా ఉండాలని కేడర్ ను ఆదేశించిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కేడర్ డీలా పడింది. ఓవర్ కాన్ఫిడెన్స్, గులాబీ పెద్దల అహంకారం, రాజరికపు పోకడలు.. జనానికి అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హ్యాట్రిక్ కొడతామని బీరాలు పలికి.. సంబురాలకు రెడీగా ఉండాలని కేడర్ ను ఆదేశించిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కేడర్ డీలా పడింది. ఓవర్ కాన్ఫిడెన్స్, గులాబీ పెద్దల అహంకారం, రాజరికపు పోకడలు.. జనానికి అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఓడిపోయింది. తెలంగాణ జనం ఈసారి మార్పు కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ రావాలి అని డిసైడ్ అయ్యి.. ఆ పార్టీని గెలిపించారు. తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పాలనను పదేళ్ళు చూశారు జనం. ఇక విసిగెత్తిపోయారు. ఈసారి కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు. దాంతో హ్యాట్రిక్ కొడతామన్న బీఆర్ఎస్ ఆశలు అడియాసలు అయ్యాయి. అసలు గులాబీ పార్టీ ఓడిపోవడానికి కారణాలేంటో చూద్దాం. తెలంగాణ జనం మార్పు కోరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ఎవరూ మూడోసారి సీఎం అవలేదు. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రికార్డు బ్రేక్ చేద్దామనుకున్న కేసీఆర్ కి.. తెలంగాణ జనం ఛాన్సివ్వలేదు. 30 శాతం జనం రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు. పదేళ్ళు అధికారం ఇచ్చాం.. ఇక చాల్లే.. కాంగ్రెస్ కీ ఛాన్సిద్దాం అనుకున్నారు.
దాంతో ఈసారి కారును కాదని హస్తానికి ఓట్లేశారు తెలంగాణ ఓటర్లు.

బీఆర్ఎస్ ఓటమికి ముఖ్యకారణం.. కేసీఆర్ కు ఉన్న విపరీతమైన అహంకారం. జనానికి అందుబాటులో లేకపోవడం. ఎప్పుడూ ఫామ్ హౌస్ కే పరిమితం అవడం.. వాస్తు బాగోలేదని పాత సెక్రటరియేట్ కి రాకపోవడం. జనాన్ని కలవకపోవడం కేసీఆర్ చేసిన తప్పులు. ఉమ్మడి ఏపీలోనూ ప్రజాదర్భార్ ఉండేది. సాయంత్రం టైమ్ లో గంటా.. రెండు గంటలు సెక్రటరియేట్ లో సీఎం అందుబాటులో ఉండేవారు. జనం అర్జీలు తీసుకునేవారు. జిల్లా స్థాయిలో పనులు కాకపోతే జనం సీఎంకు వచ్చి మొరపెట్టుకునేవారు. కానీ కేసీఆర్ ఏనాడూ… జనాన్ని కలిసిందీ లేదు. అర్జీలు స్వీకరించిందీ లేదు. ఆ అహంకారమే ఆయన్ని దెబ్బతీసింది. కేసీఆర్ కుటుంబ పాలన… కుటుంబం, మంత్రుల అవనీతి పెద్ద మైనస్ గా మారాయి. తెలంగాణపై కుటుం పెత్తనాన్ని జనం సహించలేకపోయారు. దానికి తోడు అంతులేని అవినీతిని కూడా సహించలేకపోయారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దుతానని చెప్పిన కేసీఆర్.. తన కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం జనం ఒప్పుకోలేదు. అందుకే ఓటు ద్వారా తామేంటో చూపించారు తెలంగాణ జనం

కుటుంబ పాలన.. రాజరిక పోకడలు కూడా బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారాయి. జనం కేసీఆర్ చూసి అధికారం కట్టబెడితే.. ఆయన మాత్రం కొడుకు, అల్లుడు, కూతురు, వాళ్ళ బంధువు సంతోష్ కుమార్.. ఇలా మొత్తం కుటుంబాన్నే రాజకీయాల్లోకి దించేశాడు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడినా.. మళ్ళా ఎమ్మెల్సీ సీటు ఇప్పించారు. సీఎం కుటుంబం అవినీతి అంతా ఇంతా కాదు.. కవిత లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిపైనా ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటా ఉందన్న ఆరోపణలున్నాయి. ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వాటాలు, ముడపులు అందాయని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ప్రశ్నిస్తే.. అది తెలంగాణ మహిళలకు జరిగిన అవమానం చిత్రీకరించడం ఎంత అహంకారం. కుటుంబాలను సర్వనాశనం చేసే లిక్కర్ అంటే ఏ మహిళ అయినా అసహ్యించుకుంటుంది. అలాంటి కవిత పేరు ఈ స్కామ్ లో రాగా… ఆ ఇష్యూని తెలంగాణలో ఏ ఒక్క ఆడపడుచు ఓన్ చేసుకోలేదు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతికి లెక్కేలేదు. యధారాజా తధా ప్రజా అన్నట్టుగా.. కేసీఆర్ కుటుంబం స్కామ్స్ లోనే ఇరుక్కుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులూ అదే ఫాలో అయ్యారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ ఏనాడూ స్పందించలేదు. పైగా అహంకారం ప్రదర్శించేవాళ్ళు. ఆరోపణలు చేసినవాళ్ళపై లెక్కలేకుండా మాట్లాడేవారు. జనం ఆందోళనను పట్టించుకోకపోవడంతో.. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ధరణి అడ్డుపెట్టుకొని.. కేసీఆర్ కుటుంబం, కొందరు మంత్రులు భూదందాకు పాల్పడినట్టు కూడా ఆరోపణలున్నాయి. పాత ఎమ్మెల్యేలకి మళ్లీ టికెట్లు ఇవ్వడం..కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవాలి. 30శాతానికి పైగా మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణులున్నాయి. గ్రౌండ్ లెవల్ పరిస్థితి చూడకుండా ముందే టిక్కెట్లు ఇచ్చి తానేదో ఘనత సాధించినట్టు ఫీలయ్యారు గులాబీ బాస్. రియల్ ఎస్టేట్ అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధిగా చూపించడం కూడా మైనస్ అయింది. రాష్ట్రంలోని 25శాతం ఎమ్మెల్యేలపై వ్యతికరేకత ఉంది. కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా ఆగస్టులోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు ప్రకటించారు. గ్రౌండ్ లెవల్లో వాళ్ళు గెలుస్తారా.. ఓడతారా.. అన్నది పట్టించుకోలేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో కూడా.. నన్ను బీఆర్ఎస్ కు ఓట్లేయండి అని కేసీఆర్ జనాన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్సే బీఆర్ఎస్ ను దెబ్బతీసిందని అంటున్నారు.

రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రియల్ డెవలప్మెంట్ గా చూపించడం కూడా బీఆర్ఎస్ సర్కార్ కి మైనస్ అయింది. . హైదరాబాద్ చుట్టుపక్కల భూములను తమకు వాటాలున్న కంపెనీలతో కొనిపించి.. ఇదిగో చూశారా.. బీఆర్ఎస్ వచ్చాక.. ఎకరం 100 కోట్లు పలికింది.. అని గర్వంగా చెప్పుకున్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వైఎస్ హయాం నుంచి అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మళ్ళా పుంజుకుంది. ఎకరం 100 కోట్లు పలికితే ఎవరికి లాభం. సామాన్యులు, మధ్యతరగతి జనం హైదరాబాద్ లో ఇళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉందా.. కనీసం అద్దెకు ఉండటానికి కూడా ఆర్థిక ఇబ్బందులతో మిడిల్ క్లాస్ పీపుల్ అవస్థలు పడుతున్నారు. అదేమీ గ్రహించకుండా… రియల్ ఎస్టేట్ అభివృద్ధిని చూపించి.. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది అంటే ఎలా ?

చంద్ర బాబు అరెస్ట్ విషయంలో మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఆ పార్టీని దెబ్బతీశాయి. రెండుసార్లు బీఆర్ఎస్ కు ఓట్లేసిన తెలంగాణలోని సీమాంధ్రులు ఈసారి కాంగ్రెస్ వైపు టర్న్అయ్యారు. అటు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పుంజుకోగా.. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే టాక్ తో కమలం పార్టీ బలహీనపడ్డాయి. ఇవన్నీ గులాబీ పార్టీని దెబ్బతీశాయి. ఓవైపు ఆంధ్రలో తమ పార్టీని విస్తరించుకుంటూ చంద్రబాబు అరెస్ట్ పై ధర్నా చేసిన వారిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. గత టూ టర్మ్స్ కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చిన తెలంగాణలోని సీమాంధ్రులు.. ఈసారి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. కేటీఆర్ అహంకారమే గులాబీ పార్టీని దెబ్బతీసింది.

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది.. కానీ దాన్ని సరైన రీతిలో చెప్పుకోలేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం.. కాంగ్రెస్ పార్టీలో లోపాలు వెతకడానికే ప్రచారంలో ప్రియారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడటం కూడా మైనస్ అయింది. కాంగ్రెస్ ప్రచారంతో పోలిస్తే బీఆర్ఎస్ బాగా వెనకబడింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నెగిటివ్ ఇష్యూని హైలెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ బాగా లాభపడింది.

తెలంగాణ కాంగ్రెస్ బలపడటం కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినదగ్గర నుంచీ పార్టీని బలోపేతం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత టార్గెట్ గా ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఇక్కడ కలిసొచ్చింది. రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని రాహుల్ గాంధీ, ప్రియాంక కంట్రోల్ చేసి పార్టీలో ఐకమత్యం తెచ్చారు. అదే టైమ్ లో బీజేపీ వీక్ అవడం.. ఆ పార్టీకి రిజైన్ చేసిన పెద్ద లీడర్లు తిరిగి కాంగ్రెస్ లో చేరడం.. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసొచ్చాయి

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న టాక్ మాత్రం చాలా దారుణంగా జనంలోకి వెళ్ళింది. కవిత ఈడీ ఎంక్వైరీలకు వెళ్ళి రావడం.. బీజేపీ నేతలేమో.. ఇదిగో అరెస్ట్.. అదిగో అరెస్ట్ అని ప్రకటించడం.. చివరకు కవిత అరెస్ట్ కాకపోవడం.. ఇవన్నీ జనంలో కమలం, గులాబీ పార్టీల మధ్య బంధం ఉందన్న టాక్స్ కి బలం చేకూర్చాయి. పార్టీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పెద్ద మైనస్ అయింది. కేసీఆర్ సూచనలతోనే సంజయ్ ని తప్పించారన్న వాదన జనంలోకి బాగా వెళ్ళింది. అంటే బీజేపీకి ఓట్లేసినా.. బీఆర్ఎస్ కు వేసినా ఒకటే అని ఫిక్సయ్యారు చాలామంది. ఎండ్ యాంకర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేసీఆర్, కేటీఆర్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసుకున్న స్వయంకృతాపరాధమే అని స్పష్టంగా అర్థమవుతోంది.