10 Mistakes of Pawan Kalyan: పవన్ కల్యాణ్ 10 తప్పులు.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని తప్పులు ఆ పార్టీని వెనక్కు లాగుతున్నాయి.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 05:02 PM IST

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని తప్పులు ఆ పార్టీని వెనక్కు లాగుతున్నాయి. అవేంటో చూద్దాం..

1) స్పష్టత లేకపోవడం: 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. తనకేం కావాలో స్పష్టంగా చెప్పలేక పోవడం. స్పష్టత లేక పోవడం. పార్టీ విధానం కానీ  తన విధానం కానీ స్పష్టంగా చెప్పరు. కమ్మ, రెడ్డి కి వ్యతిరేకంగా పుట్టినప్పుడు అదే విధానాన్ని స్పష్టంగా చెప్పరు. పాటించరు. అవినీతికి వ్యతిరేకం అన్నప్పుడు అది స్పష్టంగా చెప్పరు.

2) పూర్ కమ్యూనికేషన్: పార్టీ లో ఎవరిని నిలకడ గా ఉంచలేక పోవడం. పవన్ ప్రవర్తన లీడర్స్ కి మింగుడు పడక పోవడం మూవీ స్టార్ భావన లోనే ఉండటం. పార్టీ లో ముఖ్యనేతలు కానీ, కార్యకర్తలకు కానీ నమ్మకం కలిగించలేక పోవడం.చాలా మంది పార్టీని వదిలి వెళ్లిపోయారు.అందరితో మాట్లాడటం, అనేది పవన్ చరిత్ర లో లేదు. నేను చెప్పింది చేయండి అనే ధోరణి తప్ప.

3) పార్టీకి స్ట్రక్చర్ లేకపోవడం. పార్టీ పుట్టి పదేళ్లు దాటినా ఇప్పటికీ నిర్మాణం లేక పోవడం. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప పార్టీలో మరొకరు లేరు. ఈ మధ్యే నాదెండ్ల మనోహర్ కి కాస్త అవకాశం దొరుకుతుంది. మండల స్థాయి వరకు పార్టీకి నేతలు లేరు. స్ట్రక్చర్ లేదు. జిల్లా అధ్యక్షుడు ఎవరో కూడా పార్టీలో కూడా మిగిలిన వాళ్ళకి తెలియదు. మిగిలిన పార్టీలాగే జనసేనలో కూడా విపరీతమైన వ్యక్తి పూజ.. భజన. పవన్ తప్ప పార్టీలో ఎవరు ఎదగరు. పార్టీ వ్యవహారాల్లో విపరీతమైన గోప్యత. ఆయనకు తప్ప ఎవరికి ఏమి తెలియదు. ఎవరు ఏమి మాట్లాడరు. అందరికి ఒక రకమైన అభద్రత. అందరూ తనను వాడేసుకుంటన్నారని, ఎవరో తన వెనుక కుట్ర చేస్తున్నారనే భావన లోనే ఉంటారు పవన్. అందుకే ఎవరు శాశ్వతంగా ఆయనకు దగ్గరగా ఉండరు.

4) నాన్ సీరియస్ పొలిటీషియన్: పవన్ కల్యాణ్ ని సీరియస్ పొలిటీషయన్ గా జనం గుర్తించడం లేదు.అడపా దడపా రావడం ..పలకరించడం తప్ప నిత్యం జనంలో ఉండక పోవడం. సినిమాలు చేస్తూ రాజకీయాలు నడపడం కూడా సీరియస్ లేదనేది చెప్తుంది.

5) రాజకీయ విధానంపై అస్పష్టత: తన రాజకీయ విధానాన్ని స్పష్టంగా జనానికి చెప్పలేక పోవడం. అరుపులు…కేకలు… తప్ప విధాన పరంగా గట్టిగా మాట్లాడ లేక పోవడం. అసలు పథకాలు… విధానాలు పట్ల సబ్జెక్ట్ లేకపోవడం. పోలవరం గురించి అడిగితే తెల్ల ముఖం వేస్తాడు. నో డౌట్. కవిత్వం, పుస్తకాలు వ్యక్తిగత అభిలాష తప్ప పేద జనానికి అవసరం లేదని గ్రహించరు పవన్. తరచు దొరికిపోతు ఉంటారు. ఏడాది క్రితం ఏం మాట్లాడారో ఇప్పుడు గుర్తు ఉండదు. అవసరం లేని భావోద్వేగాలు పవన్ కళ్యాణ్ ని అవగాహన లేని వ్యక్తిగా ముద్రవేశాయి.

6) ఆర్థిక లోటు: పార్టీకి ఆర్థిక పరమైన శక్తి లేకపోవడం. అన్నిటికీ పవన్ కళ్యాణ్ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిందే. కొందరు సీక్రెట్ గా ఫండింగ్ చేస్తున్నారు కానీ అవి ఏమాత్రం సరిపోవు. పార్టీ నడపడానికి ఏం కావాలి, ఎలా నడపాలి అన్న ఆర్థిక అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ ఏక ధ్రువ వ్యక్తిత్వానికి భయపడి ఎవరు ఫండింగ్ చేయడంలేదు. నువ్వు ఎదగడానికి మేం ఎందుకు డబ్బు ఇవ్వాలి అనే భావన అందరిలో ఉంది. ఇప్పుడు పవన్ కి, జనసేన కి డబ్బు ఇచ్చినా రేపు పట్టించుకోడు అనే భావన చాలా మందిలో ఉంది.

7. కుల రాజకీయం: కులం విషయంలో స్పష్టత లేదు. కులం లేదంటాడు. పదే పదే కులం గురించి మాట్లాడతాడు. కాపు కులం వాళ్ళు తనకు సహాయం చేయట్లేదంటాడు. జగన్, చంద్రబాబు బహిరంగంగా కులం గురించి మాట్లాడరు. కానీ కులం ఆధారంగానే రాజకీయం నడిపిస్తారు. కులం సపోర్ట్ తోనే అన్ని నడుపుతారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పదే పదే కులం గురించి మాట్లాడి ముద్ర వేసుకుంటారు? దీని వల్ల ఇతర కులాలు దూరం అవుతాయనే ఆలోచన ఉండదు.

8. మాటలు తప్ప చేతలేవీ?: మాటలు చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏది స్థిరంగా సాధించింది లేదు. అడపా దడపా ధర్నాలు తప్ప జన సేన వల్ల ప్రభుత్వం భయపడి చేసింది ఒక్కటి లేదు.

9. కుటుంబ జోక్యం: కుటుంబపాలన లేదంటూనే నాగబాబుకి రాజకీయ ఆశ్రయం కల్పించడం. నాగబాబు నోటి దురుసు వల్ల పార్టీ లోపల బయట కూడా నష్టం వచ్చింది. కులం, కుటుంబం వద్దనుకుంటూనే వాటినే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు.

10. వాడుకుని వదిలేయడమే?: సొంత సోషల్ మీడియా తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా లో బలం లేదు. పవన్ ని నమ్మి చానెల్స్ పెట్టి ఆరిపోయారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ని చూపిస్తే రేటింగ్ వస్తుంది కనుక కొన్ని చానెల్స్ చూపిస్తాయి. టీడీపీతో స్నేహం ఉన్నంతకాలం ఆ పార్టీ మీడియా పవన్ కి ప్రాధాన్యం ఇస్తుంది. అదెంత కాలమో తెలియదు.