జైలులో లారెన్స్‌ను చంపితే రూ.1,11,11,111 రివార్డ్‌

అండర్‌ వల్డ్‌ను లారెన్స్‌ గ్యాంగ్‌ రూల్‌ చేస్తోంది. బ్యాగ్రౌండ్‌తో పని లేదు, స్టార్‌డంతో సంబంధం లేదు.. లారెన్స్‌ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసింది అంటే పర్సన్‌ ఎవరైనా ప్రాణాలకోసం భయపడాల్సిందే. కాలేజీ స్టూడెంట్‌ యూనియన్‌తో మొదలైన వీళ్ల క్రై స్టోరీ అంచలంచలుగా పెరుగుతూ అండర్‌ వల్డ్‌ను రూల్‌ చేసే స్థాయికి వచ్చింది.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 06:59 PM IST

అండర్‌ వల్డ్‌ను లారెన్స్‌ గ్యాంగ్‌ రూల్‌ చేస్తోంది. బ్యాగ్రౌండ్‌తో పని లేదు, స్టార్‌డంతో సంబంధం లేదు.. లారెన్స్‌ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసింది అంటే పర్సన్‌ ఎవరైనా ప్రాణాలకోసం భయపడాల్సిందే. కాలేజీ స్టూడెంట్‌ యూనియన్‌తో మొదలైన వీళ్ల క్రై స్టోరీ అంచలంచలుగా పెరుగుతూ అండర్‌ వల్డ్‌ను రూల్‌ చేసే స్థాయికి వచ్చింది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో జస్ట్‌ షార్ప్‌ షూటర్లే 700 మంది ఉన్నారంటే వాళ్లది ఎంత పెద్ద గ్యాంగో అర్థం చేసుకోవచ్చు. ఇంత కాలం అందరినీ బిష్ణోయ్ గ్యాంగ్‌ టార్గెట్‌ చేస్తుంటే.. ఇప్పుడు బిష్ణోయ్‌నే టార్గెట్‌ చేశాడు మరో వ్యక్తి. ఒకటి రెండు కాదు.. బిష్ణోయ్‌ని చంపితే ఏకంగా కోటీ 11 లక్షల 11 వేల 111 రూపాయలు రివార్డ్‌ ప్రకటించింది.

క్షత్రియ కర్ణి సేన చీఫ్‌ రాజేష్‌ షెకావత్‌ ఈ ప్రకటన చేశారు. బిష్ణోయ్‌ని చంపిన వాళ్లకు కోటి రూపాయలు రివార్డ్‌ ఇస్తానంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. నిజానికి లారెన్స్‌ బిష్ణోయ్‌ జైలులో ఉన్నాడు. అది కూడా రీసెంట్‌ అరెస్ట్‌ కాదు. బిష్ణోయ్‌ అరెస్ట్‌ అయ్యి దాదాపు దశాబ్ధం దగ్గిరికి వస్తోంది. కానీ ఇప్పటి వరకూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చేసిన అన్ని క్రైమ్స్‌, మర్డర్స్‌ను జైలు నుంచే ఆపరేట్‌ చేస్తున్నాడు బిష్ణోయ్‌. అది అతని నెట్‌వర్క్‌. ఏ నెట్‌వర్క్‌ సాయంతో బిష్ణోయ్‌ ఇదంతా చేస్తున్నాడో అదే నెట్‌వర్క్‌కు ఆఫర్‌ ఇచ్చాడు షెకావత్‌. జైలులో లారెన్స్‌ను చంపిన ఎవరికైనా కోటి రూపాయలు ఇస్తానంటూ ప్రకటించాడు. గతంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షెకావత్‌ స్నేహితుడిని టార్గెట్‌ చేశారు. రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన అధ్యక్షడు అమర్‌ షాహిద్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌కు, లారెన్స్‌ గ్యాంగ్‌కు మధ్య పెద్ద గ్యాంగ్‌ వార్‌ నడిచింది.

ఈ వార్‌లో సుఖ్‌దేవ్‌ను లారెన్స్‌ గ్యాంగ్‌ కాల్చి చంపింది. అప్పుడే లారెన్స్‌ను లేపేస్తానని రాజేష్‌ షెకావత్‌ ప్రతిజ్ఞ చేశాడు. కానీ లారెన్స్‌ చాలా ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. దీంతో జైలు సిబ్బందికే ఆఫర్‌ ఇచ్చాడు రాజేష్‌. లారెన్స్‌ను లేపేస్తే భారీ రివార్డ్‌ ఇస్తానంటూ వీడియో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. షెకావత్‌ వీడియోతో జైలు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లారెన్స్‌కు సెక్యూరిటీ కూడా పెంచినట్టు సమాచారం. ఇప్పటికే సిద్దిఖీ మర్డర్‌, సల్మాన్‌ ఖాన్‌ మీద ఎటాక్‌తో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు లారన్స్‌ బిష్ణోయ్‌. చాలా కాలంగా దేశంలో అలజడి సృష్టిస్తున్న ఈ యంగ్‌ గ్యాంగ్‌స్టర్‌ ఎపిసోడ్‌లో.. ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఎన్నాయో ఎన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో చూడాలి.