పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో సీట్ల పంపిణీ పై రెండు గంటల పాటు చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనకు కనీసం 45 స్థానాలు ఇవ్వాలని, జనసేన గ్రాఫ్ ఇప్పుడు నాలుగు శాతం నుంచి 15 శాతానికి పెరిగిందని.. అందువలన తమ పార్టీకి కనీసం 45 స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరారు. గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి నాలుగు జిల్లాల్లో 30 సీట్లు జనసేన కోరింది.
ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. ఇక రాయలసీమ నాలుగు జిల్లాలో 5 సీట్లు ఇస్తే చాలని.. మొత్తం ఏపీలో 45 స్థానాలు, 5 లోక్ సభ సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరారు. అయితే బాబు చాలా ఓపిగ్గా పవన్ కళ్యాణ్ కు వాస్తవ పరిస్థితులు వివరించినట్లు సమాచారం. 25 స్థానాల కంటే జనసేనకి ఎక్కువ ఇస్తే రెండు పార్టీలకు నష్టమని.. జనసేన అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఆ స్థానాలన్నీ వైసీపీ చాలా తేలిగ్గా కొట్టుకుపోతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి వివరించినట్లు సమాచారం.
జనసేనకు ఓవరాల్ గా 4 నుంచి 15% ఓటు బ్యాంకు పెరిగినా చాలా చోట్ల క్యాండిడేట్లు కూడా లేరు. ఇప్పటికిప్పుడు ఎవరినైనా ఎంపిక చేసిన కచ్చితంగా వాళ్లు గెలుస్తారని గ్యారెంటీ లేదు. అనవసరంగా 20 సీట్లు వైసీపీకి విచ్చేసినట్లే. క్యాండిట్ల లేకుండా, ఆ నియోజకవర్గంలో సంస్థాగతమైన బలం లేకుండా అభ్యర్థిని నిలబెట్టిన ,అధిష్టానం సీటు ఇచ్చిన ఉపయోగముండదని చంద్రబాబు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ కు వివరించారు. మరీ పట్టుబడితే జనసేనకు 30 నుంచి 35 వరకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అంతకుమించి ఒక్క సీటు ఇచ్చిన అది వృధా అయిపోయినట్లే అని పవన్ కళ్యాణ్ కి వివరించారట. బాబు విజ్ఞప్తిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.