500 GAS CYLINDER: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే..

పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు.

  • Written By:
  • Updated On - February 29, 2024 / 02:26 PM IST

500 GAS CYLINDER: తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా, తెల్ల రేషన్ కార్డు కలిగిన, అర్హులైన లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు ఇవ్వనుంది. అయితే, ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇలా సబ్సిడీపై ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇకపై ఏడాదికి ఎనిమిది సిలిండర్లను సబ్సిడీపై అందజేస్తుంది.

TS DSC Notification: 11062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు. పథకానికి తొలుత 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. వీరిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని తేలింది. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి నెలకు రూ.71.27 కోట్లు, ఏడాదికి రూ.855.2 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్ దారులకు రూ.816.65 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

రాష్ట్రంలో 11.58 లక్షల మంది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు ఉన్నారు. ఇప్పటికే ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌పై కేంద్రం ప్రతి సిలిండర్ కు రూ.340 సబ్సిడి అందిస్తోంది. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.155 కేటాయిస్తే.. ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్ అందుతుంది. ఇక పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. వారికి సబ్సిడీ ధరను బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు.