బ్రేకింగ్: బెజవాడకు తెలంగాణా సీఎస్

రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ అయింది. ఈ భేటీ కోసం తెలంగాణ సిఎస్ శాంతకుమారి.. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవికుమార్ గుప్తా విజయవాడ చేరుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 2, 2024 / 02:59 PM IST

రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ అయింది. ఈ భేటీ కోసం తెలంగాణ సిఎస్ శాంతకుమారి.. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవికుమార్ గుప్తా విజయవాడ చేరుకున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఏపీ – తెలంగాణ సీఎస్ ల నేతృత్వంలోని అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విభజన అంశాల పై తొలిసారి ఏపీ లో సమావేశం జరుగుతోంది.

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పై చర్చించనుంది అధికారుల కమిటీ… ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎస్ లు, అధికారుల కమిటీ మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. 2024 జూలై 5 తేదీన సీఎంల సమావేశం లో చర్చకు వచ్చిన అంశాల పై అధికారులు లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది.

షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లలో ఇటీవల 2500 కోట్ల ను విడుదల చేసింది కేంద్రం. మిగతా బకాయిల పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాల పై చర్చ జరగనుంది. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుందని సమాచారం. అలాగే వృత్తి పన్ను పంపకం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరుగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగివిపోయిన 8 వేల కోట్ల నిధులు పంపకాల పై నా అధికారుల కమిటీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.