కేసీఆర్‌కు ఘోర అవమానం.. రేవంత్ సర్కార్‌ ఏం చేసిందంటే..

అధికారం కోల్పోయిన తర్వాత... బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరుగా కేసీఆర్‌కు హ్యాండ్ ఇస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 02:27 PM IST

అధికారం కోల్పోయిన తర్వాత… బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరుగా కేసీఆర్‌కు హ్యాండ్ ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కనిపించిన గులాబీ బాస్.. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడలేదు.

దీంతో కాంగ్రెస్‌కు మరో ఆయుధం దక్కినట్లు అయింది. ఇక అటు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో.. తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మరోసారి కేసీఆర్‌ను ఘోరంగా అవమానించారంటూ.. గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయ్. ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన పత్రికను తయారుచేశారని.. బీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయ్. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి.. సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మెదక్ జిల్లాలో స్వాతంత్య్ర వేడుకల ఆహ్వాన పత్రికలో కేసీఆర్ పేరును ఎమ్మెల్సీలు, ఇతర ఎమ్మెల్యేల తర్వాత చేర్చారు.

తెలంగాణ ఉద్యమ నాయకుడైన ఆయన పేరును.. ఇలా చివరలో ఉంచడంపై బీఆర్ఎస్‌ వర్గాలు, కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి… కుంచిత స్వభావాన్ని కాంగ్రెస్ సర్కార్‌ మరొక్కసారి బయటపెట్టుకుందని ఆగ్రహం వయ్కత్ంచ వ్యక్తం చేస్తున్నారు. దుష్ట కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలు, విపరీత బుద్ధిని జనాలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ది చెప్తారంటూ పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో.. ఇప్పుడు వైరల్ అవుతోంది.