Telangana Elections : టెన్షన్‌ పెడుతున్న లాంగ్‌ వీకెండ్‌.. టెకీలు ఓటేస్తారా..

నవంబర్‌ 30న తెలంగాణలో ఎలక్షన్‌ పోలింగ్‌ జరగబోతోంది. అంటే సరిగ్గా 3 రోజులే మిగిలి ఉంది. రాష్ట్రం మొత్తం సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్‌ ఓటర్లు, మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఇప్పుడు రాజకీయా పార్టీలను టెన్షన్‌ పెడుతున్నారు.

నవంబర్‌ 30న తెలంగాణలో ఎలక్షన్‌ పోలింగ్‌ జరగబోతోంది. అంటే సరిగ్గా 3 రోజులే మిగిలి ఉంది. రాష్ట్రం మొత్తం సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్‌ ఓటర్లు, మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఇప్పుడు రాజకీయా పార్టీలను టెన్షన్‌ పెడుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్‌ తక్కువగా జరుగుతుంది. ఓట్లు వేసేందుకు పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్‌ చూపించరు. ఇది చాలా చెడ్డ పద్దతే అయినప్పటికీ.. ప్రతీ సారి జరిగేదే ఇది. సెలవు ప్రకటించినా పోలింగ్‌ కేంద్రానికి రాని బద్దకిస్ట్‌లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్లే అన్ని పార్టీలకు తలనొప్పిగా మారారు. దానికి తోడు పోలింగ్‌ టైంలో లాంగ్‌ వీకెండ్ ఉండటం ఇప్పుడు మరో టెన్షన్‌గా మారింది.

Chandrababu : రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ బాబు హాజర్

గురువారం పోలింగ్‌ కాబట్టి ఎలాగూ ఆఫీస్‌ ఉండందు. శుక్రవారం ఆఫీస్‌ ఉంటుంది. శని, ఆదివారాలు మళ్లీ సెలవు. మధ్యలో గ్యాప్‌ ఉన్న శుక్రవారం లీవ్‌ తీసుకుంటే హ్యాపీగా 4 రోజులు వీకెండ్ ఎంజాయ్‌ చేయొచ్చు. పోలింగ్‌ టైంలో కూడా వాళ్లు ఇలాగే అనుకుంటే.. ఆ ఎఫెక్ట్‌ ఎన్నికల మీద పడుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు ఓటింగ్‌ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కువినియోగించుకోవాలని సూచిస్తున్నాయి. నిజం చెప్పాలంటే అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్లు తెలుసుకుకోవాల్సిన నిజం. ఓటు అనేది ప్రతీ ఒక్కరి హక్కు. పనులు ఉన్నాయని ఆ హక్కును వినియోగించుకోకపోతే ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుంది. కొత్త ఓటర్లకు పాత ఓటర్లకు ఇవే విషయాన్ని కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అన్ని పార్టీలు. మరి ఉద్యోగులు ఓటింగ్‌ కేంద్రానికి వెళ్తారా.. లాంగ్‌ వీకెండ్‌ ప్లాన్‌తో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేస్తారా చూడాలి మరి.