Congress party : 2 ఫ్యామిలీలకు 2 టికెట్లు.. కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ ఖాయమా ?

కాంగ్రెస్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి.. కుటుంబ రాజకీయాల ప్రస్తావన వస్తుంటుంది. తండ్రులు, కొడుకులు, మనవలకే టికెట్లు ఇప్పించుకుంటారు. నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి నిరాశే మిగులుతుంది ఆ పార్టీలో అని.. కాంగ్రెస్ మీద ఓ చెడ్డ అభిప్రాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ మీద ఇలాంటి అభిప్రాయమే ఉంది. అందుకే చాన్స్ దొరికిన ప్రతీసారి.. కుటుంబ రాజకీయాలు అంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుంటుంది బీజేపీ.

దీంతో హస్తం పార్టీ కూడా అలర్ట్ అయింది. ఆ మధ్య ఉదయ్‌పూర్‌లో మీటింగ్ పెట్టుకొని మరీ.. ఓ డిక్లరేషన్ తీసుకువచ్చింది. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ అని.. ఎట్టిపరిస్థితుల్లో ఈ కండిషన్ విషయంలో తగ్గేది లేదని గట్టిగా చెప్పింది. కట్ చేస్తే తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు పాతర పెట్టారు తెలంగాణలో ! తెలంగాణలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్‌ చేసింది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను తెలంగాణ నుంచి అమలు చేయాలని అనుకున్న కాంగ్రెస్‌.. ఆ డిక్లరేషన్‌ను ఇక్కడే తొక్కేసిన పరిస్థితి కనిపించింది. ఏం జరిగిందో.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కానీ౩.. కుటుంబ రాజ‌కీయాల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని క్లియర్‌గా అర్థం అవుతోంది.  55మందిలో తెలంగాణలో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్‌. అయితే ఇందులో రెండు కుటుంబాల‌కు రెండేసి చొప్పున టికెట్లు కేటాయించ‌డం.. పార్టీలో మరిన్ని అసంతృప్తులకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు కుటుంబానికి.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి  కుటుంబాల‌కు.. కాంగ్రెస్ పార్టీ రెండేసి టికెట్లు ఇచ్చింది. మెద‌క్ అసెంబ్లీ స్థానాన్ని మైనంప‌ల్లి రోహిత్‌కు కేటాయించ‌గా.. మ‌ల్కాజ్‌గిరి టికెట్‌ను మైనంప‌ల్లి హ‌నుమంత‌రావుకు ఇచ్చింది. కీల‌క‌మైన కోదాడ టికెట్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డికి కేటాయించిన కాంగ్రెస్.. ఉత్తమ్‌కు హుజూర్‌న‌గ‌ర్ టికెట్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్‌లో చాలామంది నేతలు.. తమ వారసులతో పాటు రెండేసి టికెట్లు అడుగుతున్నారు. ఆ లిస్ట్‌లో జానారెడ్డితో పాటు కొండా ఫ్యామిలీ, పీజేఆర్ ఫ్యామిలీ, మల్లు రవి.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆమె భర్త జాన్సన్ నాయక్‌.. ఇలా తమ ఫ్యామిలీకి టికెట్లు అడుగుతున్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. ఉత్తమ్‌, మైనంపల్లి కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో.. వాళ్లంతా ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోయే అవకాశాలు ఉంటాయ్. దీంతో కాంగ్రెస్‌లో కొత్త రచ్చ స్టార్ట్ అవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.