హైదరాబాద్ పార్లమెంట్ (Parliament Elections) అభ్యర్థిగా మొదటిసారిగా ఓ మహిళను బీజేపీ నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ MIM ఎంపీ (MIM MP) అసదుద్దీన్ ఓవైసీకి తిరుగులేదు. పైగా ఎప్పటి నుంచో ఓవైసీ ఫ్యామిలీయే గెలుస్తుంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన భగవంత్ రావును కాదని ఈసారి మాధవీలతను నిలబెట్టి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ (BJP) హైకమాండ్. ముస్లిం మహిళల ఓట్లను టార్గెట్ చేయడానికే ఆమెకు టిక్కెట్ ఇచ్చారని అంటున్నారు కమలంపార్టీ నేతలు.
MIM కు కంచుకోటగా ఉన్న పాతబస్తీలోని… హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి సరి కొత్త అస్త్రాన్ని వదిలింది కమలం పార్టీ. విరించి హాస్పిటల్ ఫౌండర్ ఛైర్మన్ విశ్వనాథ్ భార్య మాధవీలతకు టిక్కెట్ ఇచ్చింది. లతా ఫౌండేషన్ ద్వారా ఆమె గత కొంత కాలంగా పాతబస్తీలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. పేదలను ఆదుకోవడంలో మాధవీలతకు మంచి పేరు ఉంది. ఆమె భరతనాట్య కళాకారిణి. ఒకప్పుడు NCC కేడిట్ కూడా. ఆరు నెలల క్రితమే మాధవీలతకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ టిక్కెట్ పై హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ సీటు రాజా సింగ్ కు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మాధవీలతను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో పోటీ చేసే మగాడు లేడా… మహిళకు ఎందుకు టిక్కెట్ టిక్కెట్ ఇచ్చారని రాజాసింగ్ ప్రశ్నించారు. కానీ హైదరాబాద్ స్థానానికి మాధవీలతను ఎంపిక చేయడానికి బీజేపీకి ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఆమె పాతబస్తీలో సేవా కార్యక్రమాలను ప్రారంభించనప్పటి నుంచే… త్రిపుల్ తలాఖ్ పైనా క్యాంపెయిన్ చేస్తున్నారు. కొందరు ముస్లిం మహిళా గ్రూపులతో కలసి పాత బస్తీలో ఈ ఇష్యూ మీద పనిచేస్తున్నారు కూడా.. ఫోరమ్ ఫర్ అవేర్నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, సంస్కృతి తెలంగాణ సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. తలాఖ్ తో నష్టపోయిన మహిళలకు కొద్దో గొప్పో సాయం కూడా చేస్తున్నట్టు సమాచారం. ట్రిపుల్ తలాఖ్ రద్దుపై చాలా మంది ముస్లిం మహిళలు సంతోషంగా ఉన్నారు. బీజేపీకి, నరేంద్ర మోడీకి ఫేవర్ గా ఉన్నారు. ఈ ఇష్యూ మాధవీలతకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
పాతబస్తీలో 20యేళ్ళుగా హిందువులకు సంబంధించిన అనేక ధార్మాకి కార్యక్రమాలను కూడా మాధవీలత చేస్తున్నారు. విశ్వనాథ ఫౌండేషన్, లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతబస్తీలో గోశాలలు నిర్వహిస్తున్నారు. హిందూయిజంపై జనంలో చైతన్యం తెస్తున్నారు. పాతబస్తీలోని స్కూళ్ళు, కాలేజీల్లో భారతీయ సంస్కృతి గురించి మాధవీలత తరుచుగా లెక్చర్స్ ఇస్తుంటారు. ఇటు హిందువులతో పాటు అటు ముస్లింల్లో సేవా కార్యక్రమాలతో దగ్గరైనందునే… మాధవీలతకు హైదరాబాద్ బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సీటులో ఓవైసీకి మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.