నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరో మాటలా ఉందని మండిపడ్డారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉందన్నారు రజనీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు నేనున్నాను అని ఎప్పటికప్పుడు భుజం తట్టారన్నారు. ఇకపై రైతులకు సంభందించిన ప్రతి అంశంలో వారికి పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రైతు సమస్యలపై నరసరావుపేటలో రేపు కలెక్టర్ కి వినతిపత్రం అందజేస్తామని స్పష్టం చేసారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందన్నారు. కేవలం వైసీపీ నేతలపై కేసులు పెట్టడానికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు.