తెలంగాణా అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బిఏసి సమావేశం నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక హరీష్ రావు మాట్లాడుతూ… బిఏసి అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదంటూ… ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం అన్నారు. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బిఎసి నుంచి వాకౌట్ చేసినమని స్పష్టం చేసారు.
రేపు లగచర్ల అంశంపైన చర్చకు బీఆర్ఎస్ పట్టు పడుతుంది అన్నారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరోక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయమన్నారు. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం.. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాలా కీలకమని తెలిపారు. కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే అని ఆయన డిమాండ్ చేసారు. కానీ బిఏసికి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.
బిఏసి చెప్పినట్టే సభ నడుస్తుందన్న హరీష్ హౌస్ కమీటీల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. పిఏసి పైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఏట్లా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ ను బీఆర్ఎస్ అడిగింది. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఉల్లంఘనల పైన స్పీకర్ హమీ ఇవ్వాలని ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హమీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. బిఏసి లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేసారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం వ్యక్తం చేసారు హరీష్.