TELANGANA ELECTIONS: తెలంగాణలో హంగ్‌ ఖాయం.. సీవోటర్ సర్వేలో సంచలనాలు..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిది అన్న దానిపై పలు సర్వే సంస్థలు.. జనాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాయ్. ఇలా ఏబీపీ సీ వోటర్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. తెలంగాణలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సీ వోటర్ సర్వేలో తేలింది.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 06:15 PM IST

TELANGANA ELECTIONS: ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయింది. జనంలో ఉంటాం.. జనాల్లో ఉంటాం అన్నట్టుగా.. చల్‌ చలో అనే రేంజ్‌లో జనాల్లోకి దూసుకెళ్తున్నాయ్ పార్టీలు. ఇక అటు ఈసారి ఎవరు గెలుస్తారన్న దానిపై జనాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రతి పార్టీ తీరును జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఐతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిది అన్న దానిపై పలు సర్వే సంస్థలు.. జనాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాయ్.

ఇలా ఏబీపీ సీ వోటర్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. తెలంగాణలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సీ వోటర్ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కారు పార్టీకి 43 నుంచి 55 సీట్లు.. కాంగ్రెస్‌కు 48 నుంచి 60 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇక అటు బీజేపీకి మాత్రం కేవలం 5 నుంచి 11 సీట్లు మాత్రమే వస్తాయని జనాలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపింది. సీ ఓటర్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌కు 39శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 37శాతం ఓట్లు.. బీజేపీకి 16శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఇదంతా ఎలా ఉన్నా.. అధికార బీఆర్‌ఎస్‌.. ఎలాగైనా సరే హ్యాట్రిక్‌ కొట్టాలని, మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇక అటు కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తెలంగాణ ప్రధానంగా త్రిముఖ పోరు దిశగా పయనిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిన కొంత పట్టు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 19 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. 117 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.