బ్రేకింగ్: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో దశలో రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

  • Written By:
  • Publish Date - November 2, 2024 / 07:48 PM IST

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో దశలో రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి జీవో.196 జారీ చేస్తూ అనుమతులు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా మెట్రో రైలు రెండో దశను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటాగా రూ.4,230 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం కానున్నాయి. జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటాగా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్దతిలో రూ.1.033 కోట్లతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపడతారు. మెట్రో రైలు రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మెట్రో రైలు రెండో దశలో పార్ట్ -ఏ గా 76.4 కిలో మీటర్ల నిర్మాణం చేపట్టనున్నారు.

మెట్రో రైలు రెండో దశలో పార్ట్ బి కింద 40 కిలోమీటర్ల నిర్మాణం చేపడతారు. మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏ లో ఐదు కారిడార్ల నిర్మాణం ఉంటుంది. కారిడార్ 4 లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కి. మీ నిర్మాణం, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కి.మీ. నిర్మాణం, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కి.మీ నిర్మాణం, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కి.మీ నిర్మాణం, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ నిర్మాణం చేపట్టనున్నారు. మెట్రో రైలు రెండో దశ పార్ట్-బిగా కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్యూచర్ సిటీ వరకు నిర్మాణం చేపట్టనున్నారు.