అక్క రెడీ అవుతోంది.కేసీఆర్ కూతురు ….బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది.ఆమె అజెండా కూడా ఫిక్స్ అయింది.అతి త్వరలోనే ఆమె జనంలోకి రాబోతుంది.జైలుకు వెళ్ళబోయే ముందు సిద్ధం చేసుకున్న స్కెచ్‌నే ఇప్పుడు అమలు చేయబోతుంది.నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు. నాలుగు రోజులు కళ్లు మూసుకుని జనం లో తిరిగితే పబ్లిక్ అలవాటు పడిపోతారు.ఎలాగూ తెలంగాణ టాగ్ లైన్ ఉంది కదా . దాన్ని అడ్డం పెట్టి కథ నడిపిస్తాం అనే ధీమా లో ఉందట కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో 164 రోజుల పాటు తీహార్ జైల్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత…ఈ ఏడాది ఆగస్ట్ 27న బయటికి వచ్చారు. కేసీఆర్ అదేశంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. జనం కి జ్యాపక శక్తి తక్కువ కనుక కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉన్నది కవిత. ఎక్కడా ప్రజల మధ్యకు కూడా రాలేదు. అయితే… ఎమ్మెల్సీ కవిత ఖాళీగా ఇంట్లో కూర్చోలేదని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారన్న ప్రచారం జరిగింది. హఠాత్తుగా అదానీకి ఒక న్యాయం ఆడదానికి ఒక న్యాయమా అంటూ ఎక్స్ లో కేంద్ర కేంద్రం పై విమర్శల దాడి మొదలుపెట్టారు కవిత.
దీంతో… ఆమె రీ ఛార్జ్ అయ్యారా? ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతున్నారా? అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇక డైరెక్ట్‌గా క్షేత్రస్థాయికి వెళ్ళాలనుకుంటున్నారని, అందుకు ఎక్స్ మెస్సేజ్‌ను శాంపిల్‌గా వదిలి ఉంటారని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్ కేడర్ .ఏ అంశంతో జనంలోకి వెళ్ళాలన్నదానిపై పార్టీ నేతలతోను, కుల సంఘాలతోను త్వరలోనే భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటే… ఏ అంశం తీసుకుంటే తొందరగా జనాల్లోకి వెళ్తామోనని లెక్కలు వేసుకుంటున్నారట కవిత. ప్రభుత్వం మీద ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత పెరుగుతోందని, వారి పక్షాన పోరాటానికి ఎమ్మెల్సీ సిద్ధమవుతున్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అటు కేంద్రంలో బీజేపీని, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా అంశాల వారీ ప్రణాళికలు సైతం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అన్నిటికంటే ముందుగా… కవిత బీసీ నినాదం అందుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
జైలుకు వెళ్ళక ముందే ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు కవిత. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్‌తో కవిత బీసీ ఉద్యమం మొదలైంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం బీసీ డిక్లరేషన్ కమిషన్‌ను కూడా నియమించింది రేవంత్‌రెడ్డి సర్కార్. బీఆర్ఎస్ సైతం త్వరగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు వినతిపత్రం ఇచ్చింది. అలాగే… ఈ నెల 26న భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా కమిషన్‌కు వినతిపత్రం ఇవ్వబోతున్నారట. అలా పార్టీ తరపున కూడా బీసీ నినాదం ఎత్తుకునేందుకు కవిత సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న కుల గణన సర్వేలో తాను కూడా పాల్గొన్నట్టు ఫోటో కూడా విడుదల చేసింది కవిత. కులగణన సర్వే ఫోటో ఎందుకు విడుదల చేసిందో అర్థం కాక జుట్టు పీక్కున్న వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికింది.
అక్క ఎంత పకడ్బందీ గా ప్లాన్ వేసుకుందో తెలిసింది.ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్ష దివస్‌లో పాల్గొనడం ద్వారా కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఉండబోతోంది.బీసీ కులగణన అంశంపై అప్పుడు కవిత గట్టిగా మాట్లాడతారన్నది బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. అంతవరకు ఓకే… రీ ఎంట్రీ కోసం గట్టి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం సంగతి ఎలా ఉన్నా… పార్టీలో అంతమంది బీసీ నాయకులు ఉండగా కవిత ఈ నినాదాన్ని అందుకోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఎలాంటి పథకాలు అమలు అవుతున్నాయని అధ్యయనం చేసేందుకు గతంలో పలువురు బీఆర్‌ఎస్ బీసీ నాయకులు తమిళనాడు వెళ్ళి వచ్చారు.
తమ వాయిస్ గట్టిగా వినిపించారు. మరి అలాంటి బీసీ నేతల్ని పక్కనబెట్టి కవిత బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏంటి? బీఆర్‌ఎస్‌లోని బీసీలకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరా అన్న విమర్శలు పెరుగుతున్నాయి. అయితే అది brs. అక్కడ కేసీఆర్ కుటుంబమే అన్ని కనుక కవిత ని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు.
గట్టిగా 3 నెలలు జనం లో తిరిగితే అన్ని మర్చిపోయి పిచ్చ జనం నెత్తిన పెట్టుకుంటారు. ఈ లోగా కేటీఆర్ అరెస్ట్ అయితే తాను ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ ఇంకా దూసుకు పోవచ్చు. ఇలా పక్కా మాస్టర్ ప్లాన్ తో కవిత పొలిటికల్ రీ ఎంట్రీ కి సిద్దం అవుతున్నారు. అక్క వస్తోంది ఇక కాస్కోండి.