ఎఐడిఎంకె కీలక నేత…మాజీ సిఎం పన్నీర్ సేల్వం ధర్మయుద్దం 2.ఓ ప్రారంభించారు.ఇన్నాళ్ళు శతృవు భావించిన శశికళ టింతో చేతులు కలిపారు… స్వయంగా పన్నీర్ సేల్వమే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో గత రాత్రి భేటీ అయ్యారు. అడయార్‌లోని దినకరన్ ఇంటికి తన అనుచరుడు బన్రూట్టి రామచంద్రన్‌తో కలిసి వెళ్లిన ఓపీఎస్.. అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీ తమిళ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వారిద్దరూ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు ప్రకటించారు.
తాము బలపడడం, తమ ప్రత్యర్థి ఎడప్పాడి పళనిస్వామిని కట్టడి చేయడంపైనే ప్రధానంగా వారు చర్చించినట్లు సమాచారం.. ప్రస్తుతం పార్టీ ద్రోహుల చేతుల్లోకి వెళ్లిందని, కార్యకర్తల అండతో దినకరన్, శశికళతో కలిసి పార్టీని రక్షించుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. తమ మధ్య ఎలాంటి పగలు, ప్రతీకారాలు లేవని, కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కలిసి సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. పార్టీని కాపాడుకునేందుకే చేతులు కలిపామన్నారు. ఎడప్పాడి పార్టీ ద్రోహి అని, డీఎంకే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు ఇద్దరు నేతలు… వీరి ఇద్దరి కలయిక …ప్రకటనలు ఎఐడిఎంకెలోని నేతలకు షాక్ ఇచ్చినట్లైంది… ఊహించని విదంగా ఓపిఎస్ అడుగులు వేయడానికి చిన్నమ్మ శశికళ అనే టాక్ పార్టీలో గట్టిగా వినపడుతూంది…
నిజానికి ఓపిఎస్ పరిస్థితి ఇటు పార్టీలోని, రాజకీయంగాను ఏమాత్రం బాగాలేదు… జయలలిత నిచ్చెలి శశికళ జయలలిత మరణం అనంతరం పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసినా సమయంలో ధర్మయుద్దం అంటూ 2017లో ధర్నకు దిగు శశికళపై తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.దీంతో సిఎం కుర్చీ కూర్చోవాల్సిన శశికళ జైలు పోవడం.. దాని తరువాత అమె అనుచరుడైన ఎడప్పాడి పళనిస్వామి వెలుగులోకి వచ్చి సిఎంగా బాధ్యతకు స్వీకరించారు.. ఇక అప్పటి నుండి పార్టీ మూడు ముక్కలుగా మిగిలిపోయింది ..అటు తరువాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి బాధ్యతల కోసం పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలు కోర్టులను ఆశ్రయించాయి.
దీనిలో భాగంగా గతంలో మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పన్నీరు సెల్వం సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం పళనిస్వామియే అన్నాడిఎంకె కు సింగిల్ నాయకుడు అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తేల్చి చెప్పింది..తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. రెండాకుల గుర్తును కూడా పళనిస్వామే దక్కించుకున్నారు. దీంతో ఇటు పార్టీలోని, రాజకీయంగా పన్నీర్ సేల్వం ఓంటరిగా మారారు..
ఇటువంటి సమయంలో మరోసారి చక్రం తిప్పారు చిన్నామ్మ శశికళ…ఓపిఎస్ బిజెపితో కలుస్తారని అనుకుంటూన్న వేళ… అందరికీ షాక్ ఇస్తూ శశికళ మేనల్లుడు టిటివీ దినకరన్ కలిశారు పన్నీర్ సేల్వం .. పాత కక్షలు అన్ని పక్కన పెట్టి తన భవిష్యత్తు కోసం శశికళనే పన్నీర్ సేల్వంను దగ్గరకు చేర్చుకుందమే టాక్ నడుస్తుంది …అందులో భాగంగానే పన్నీర్ ద్వారా ధర్మయుద్దం 2.ఓ ను చిన్నమ్మ ఎఐడిఎంకె ప్రస్తుత కార్యదర్శి పళణిస్వామీపై ప్రయోగించడానికి సిద్దమౌనట్లు చర్చ నడుస్తుంది.
వీరి ఇద్దరికీ కలయిక పళణిస్వామీ వర్గానికి ఒక బిగ్ షాక్ చేబుతున్నారు తమిళనాడు నేతలు…ప్రస్తుతం వీరి టార్గెట్ పళణిస్వామీ నుండి పార్టీ స్వాధీనం చేసుకోవడం అంటున్నారు.. చాలావరకు నేతలు ఇప్పటికి శశికళతో టచ్ లో ఉన్నట్లు సమాచారం ..డిఎమ్‌కె ను ఢీకోట్టాలన్న…పార్టీ అధికారంలోకి రావాలన్న అది శశికళతోనే సాధ్యం అనే భావనను పార్టీలోని మధ్యస్థంగా ఉన్నావారికి కలిగిస్తున్నారు.. దీంతో పార్టీ సర్వసభ్య సమావేశంలో తనకు అనుకూలంగా ఓటింగ్ ఉండేలా చూడాలన్నాది శశికళ ఆలోచన..అందుకే ఎవరు ఊహించని విధంగా మోసం చేసి జైలుకెళ్ళడానికి కారణం అయినా ఓపిఎస్ తో కలగడానికి నిర్ణయం తీసుకుని ధర్మయుద్దం 2ఓ అమలు చేస్తోందటా… మరి చూడాలి ఈ ఇద్దరు కలయికను ప్రస్తుత ఎఐడిఎంకె కార్యదర్శి పళణిస్వామీ ఎలా ఎదుర్కొని పార్టీని కాపాడుకుంటారో.