Akhilesh Yadav: ప్రచారంలో దుమ్ములేపుతున్న అఖిలేష్‌ యాదవ్‌ కూతురు.. పార్టీ పగ్గాలు ఆమెకేనా..?

సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ యాదవ్‌ కూతురు అదితీ యాదవ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లండన్‌లో హైయర్‌ స్టడీస్‌ చేస్తున్న అదితీ ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చింది. తల్లి డింపుల్‌ యాదవ్‌కి మద్దతుగా మైన్‌పురీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రచారం నిర్వహిస్తోంది.

  • Written By:
  • Updated On - April 11, 2024 / 08:00 PM IST

Akhilesh Yadav: దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారం చేజిక్కించుకునేందుకు జాతీయ పార్టీలు, తమ పట్టు నిలుపుకునేందుకు ప్రాంతీయ పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఈసారి బీజేపీని తిరుగులేని దెబ్బ కొట్టాలని సమాజ్‌వాదీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఐతే ఈసారి సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ యాదవ్‌ కూతురు అదితీ యాదవ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Sania Mirza: సానియాతో స్మిత.. స్మితాకు సానియా రంజాన్ ధావత్‌.. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..

లండన్‌లో హైయర్‌ స్టడీస్‌ చేస్తున్న అదితీ ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చింది. తల్లి డింపుల్‌ యాదవ్‌కి మద్దతుగా మైన్‌పురీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రచారం నిర్వహిస్తోంది. ఫారిన్‌లో చదువుకున్న అమ్మాయికి ఇక్కడి రాజకీయాలు ఏం తెలుసుకు అనుకేవాళ్లందరికీ అదితీ స్పీచ్‌లు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. స్థానిక సమస్యలపై మాట్లాడ్డమే కాకుండా.. మోడీకి కౌంటర్‌లు కూడా ఇస్తూ ప్రచారంలో హైలెట్‌గా నిలుస్తోంది అదితీ. దీంతో ఎక్కడికి వెళ్లినా అదితీని చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు భారీ సంఖ్యలో ప్రజలు మీటింగ్‌లకు వస్తున్నారు. లండన్‌లో చదువుకున్న అమ్మాయి అనడంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్న సీన్‌ చూస్తుంటే అఖిలేష్‌ తరువాత సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు అదితీ తీసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో పొలిటీషియన్‌ అని మార్చుకుంది అదితీ యాదవ్‌.

తల్లికి మద్దతుగా ప్రచారం చేస్తూ లైవ్‌ పాలిటిక్స్‌ను, ప్రచారాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తోంది. ఇవన్నీ చూస్తే అఖిలేష్‌ వారసురాలిగా అదితీని సిద్ధం చేస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. గతంలో మైన్‌పురీ నుంచి ములయాంసింగ్‌ పోటీ చేశారు. ఆయన తరువాత అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అదితి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆమె ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. నార్మల్‌గా అన్ని పార్టీలకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉంటారు. కానీ సమాజ్‌వాదీ పార్టీకి అఖిలేష్‌ కూతురే స్టార్‌ క్యాంపెయినర్‌గా మారిపోయింది. త్వరలోనే పార్టీ అధ్యక్షురాలయ్యే అవకాశం కూడా ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది.