కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన వాళ్లంతా ఔట్‌..

చేసిన ప్రతీ పనికి ఫలితం దక్కుతుందని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఈ మాట ప్రతీ రంగానికి వర్తిస్తుంది.. చివరకు రాజకీయాలకు కూడా ! చేసిన ప్రతీ పనికి ఫలితం ఏదో ఒకరూపంలో కనిపిస్తూనే ఉంటుంది. మంచి చేస్తే మంచి.. ముంచే పనులు చూస్తే ముప్పు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. ఒక పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలోకి జంప్ చేసి.. తమ దశ తిరిగిపోయింది. ఇక తమకు తిరుగేలేదు అనుకునే వారికి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. అసలైన దారి చూపించాయ్. ఐదేళ్లు జనాలు మౌనంగా ఉండొచ్చు.. తమదైన రోజు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పకనే చెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. ఆ తర్వాత అధికార పార్టీలోకి జంప్ అయి.. కేసీఆర్ పంచన చేసిన చాలామంది ఇప్పుడు ఇంటి దారి పట్టిన పరిస్థితి. తాము గెలిపించిన గుర్తును కాదని.. వేరే పార్టీలోకి వెళ్లి కోట్లకు కోట్లు దండుకొని.. ఇప్పుడు వేరే గుర్తు మీద పోటీ చేసిన ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించారు. ఎవరేం పట్టించుకోరులే.. ఎవరికి టైమ్ ఉంటుంది.. తాము చెప్పిందే శాసనం అనుకునే నేతల అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పారు జనాలు. ఈ లిస్ట్‌లో చాలామందే ఉన్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, అశ్వరావు పేట మెచ్చా నాగేశ్వరరావు, పాలేరు ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి సురేందర్, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, తాండూరులో పైలట్‌ రోహిత్ రెడ్డి.. ఇలా దాదాపు 10మంది ఎమ్మెల్యేలను జనాలు ఇంటి దారి పట్టించారు.

వీళ్లంతా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఈ పది మంది నాయకులు.. ఎవరు కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఏంటో ! ఈ పది నియోజకవర్గాల్లో వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించింది. ఇలా తెలంగాణ ఎన్నిక చాలా పాఠాలు నేర్పించింది. నమ్మిన పార్టీని, నమ్ముకున్న పార్టీకి.. నమ్మకద్రోహం చేస్తే ఆ పార్టీ వాళ్లు ఊరుకుంటారేమో కానీ.. జనాలు మాత్రం ప్రతీది గమనిస్తుంటూనే ఉంటారు జాగ్రత్త అనే సంకేతాలు పంపించింది.