Alla Ramakrishna Reddy: రాజీనామా వెనక! ఆళ్ల రాజీనామాకు ఆయనే కారణమా.. అసలేం జరిగింది ?

మంగళగిరిలో కొంతకాలంగా వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయ్. వర్గపోరు పీక్స్‌కు చేరుకుంది. ఈ మధ్యే పోటాపోటీగా ఆఫీస్‌లు కూడా ప్రారంభించండం కొత్త చర్చకు కారణం అయింది. నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 03:09 PM IST

Alla Ramakrishna Reddy: ఏపీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఫ్యాన్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. ఈ లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు.. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ జనాలకు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన ఆర్కే.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. త్వరలోనే కారణాలు చెప్తానని వివరించారు.

ARTICLE 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రధాని స్పందన ఇదే..!

మంగళగిరిలో కొంతకాలంగా వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయ్. వర్గపోరు పీక్స్‌కు చేరుకుంది. ఈ మధ్యే పోటాపోటీగా ఆఫీస్‌లు కూడా ప్రారంభించండం కొత్త చర్చకు కారణం అయింది. నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయ్. దొంతి వేమారెడ్డి కూడా నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి.. పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్‌ ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తర్వాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు. పైగా ఆళ్లను దూరం పెడుతూ వచ్చారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అలాగే గంజి చిరంజీవికి వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఈ అంశం కూడా ఆర్కేను బాధపెట్టింది అంటున్నారు. అందుకే ఆళ్ల రాజీనామా చేశారని తెలుస్తోంది. మంగళగిరిలో చిరంజీవికి చెందిన పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. వైసీపీ పెద్దలు కూడా టికెట్ విషయంలో ఆయనవైపే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఆళ్ల మొదటిసారి చిరంజీవిపైనే గెలిచారు. అది కూడా కేవలం 14ఓట్ల తేడాతో! ఇప్పుడు ఆళ్ల రాజీనామాతో మంగళగిరి రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది.. ఆయన నెక్ట్స్ అడుగులు ఎటు అన్నది ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది.