భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు చెప్తే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. ముందు కేటీఆర్ తమకు మద్దతు ఇస్తున్నాడు అని భావించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ను ఇరికిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదేపదే మీడియా సమావేశాల్లో అలాగే బహిరంగ వేదికలపై అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విధానంపై కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ సంచలనగా మారుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొన్న కేటీఆర్… అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని అసలు సినిమా వాళ్ళు అతన్ని ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడం లేదని అందుకే ఆ కోపాన్ని తట్టుకోలేక అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారని కామెంట్ చేశారు. ఇక తాజాగా కూడా ఇదే కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సినిమా యాక్టర్… రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని, ఈ చిట్టి నాయుడుకు అది నచ్చలేదని… అందుకే అదుపులోకి తీసుకున్నారంటూ మాట్లాడారు. ఇలా పదేపదే రేవంత్ ను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారనే ఒపినియన్ వినపడుతోంది.
ఇప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ కావాలనే రెచ్చగొట్టాలని చూస్తున్నారని… ఇక సినిమా వాళ్లు తనకు విలువ ఇవ్వటం లేదు అనే భావనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారని ఈ టైం లో కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ అల్లు అర్జున్ ను మరింత ఇబ్బంది పెట్టడం ఖాయమని ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు. అందుకే తెలంగాణ పోలీసులు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. కేటీఆర్ మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదని పదేపదే మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్ అభిమానులు రిక్వస్ట్ చేస్తున్నారు.
సినిమా పరిశ్రమతో కేటీఆర్ కు మంచి సంబంధాలు ఉన్న విషయం అందరికీ ఒక ఐడియా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగోకి వెళ్లే వ్యక్తి కావడంతో కేటీఆర్ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇక అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కు కూడా తెలంగాణ పోలీసులు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అరెస్ట్ తర్వాత హైకోర్టులో బెయిల్ రావడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ విషయంలో కాస్త సీరియస్ గానే అడుగులు వేస్తున్నారు. అటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా ఇప్పుడు ఈ విషయంలో ఇబ్బంది పడుతోంది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. ఈ వివాదమైతే ఇప్పట్లో ముగిసిపోయేలా కనపడటం లేదు.