ALLU ARJUN-REVANTH REDDY: రేవంత్‌కు అల్లు అర్జున్ మద్దతు.. మామ కోసం ఏం చేయబోతున్నారంటే..

హీరో అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కేసీఆర్‌కు భారీ హ్యాండ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని భావించిన చంద్రశేఖర్‌ రెడ్డికి.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అప్పటి నుంచే అసంతృప్తిగా కనిపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 01:18 PM IST

ALLU ARJUN-REVANTH REDDY: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయ్. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ దూకుడు మీద కనిపిస్తుంటే.. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం అయిన కారు పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. ఒక్కొక్కరిగా కారుకు హ్యాండ్ ఇస్తూ.. హస్తం పార్టీ వైపు వెళ్తున్నారు. గులాబీ పార్టీకి నమ్మకస్తులు అని పేరు ఉన్న నేతలు కూడా.. జంపింగ్ జపాంగ్ అంటుండడం.. బీఆర్ఎస్‌కు మింగుడు పడకుండా చేస్తోంది. ఇలా జంప్ చేస్తున్న వారిలో ఇప్పుడు కొత్త నేత చేరిపోయారు.

Hyper Aadi: లవ్ స్టోరీ.. మ్యారేజ్ దాకా వెళ్లకపోవడానికి అదే కారణం: హైపర్ ఆది

హీరో అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కేసీఆర్‌కు భారీ హ్యాండ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని భావించిన చంద్రశేఖర్‌ రెడ్డికి.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అప్పటి నుంచే అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఐతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారట. 2014కంటే ముందు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కంచర్ల చెప్తున్నారు. తాను చదువుకునే సమయంలో కాంగ్రెస్ యూత్ విభాగంలో పనిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందన్నది ఆయన మాట. కంచర్ల చేరిక తమకు కూడా ఫ్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఆయన అల్లుడు అల్లు అర్జున్ సినీ గ్లామర్‌ను యూజ్ చేసుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. 2014లో టీఆర్ఎస్ తరఫున ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్‌ ఓడిపోయారు. 2018ఎన్నికలకు దూరంగా ఉండగా.. 2023 ఎన్నికలకు ముందు మళ్లీ యాక్టివ్ అయ్యారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.

అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఐతే అక్కడ సిట్టింగ్‌కే అవకాశం ఇవ్వటంతో కంచర్లకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఐతే మామ కాంగ్రెస్‌లో చేరితే.. తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టికెట్ వస్తే.. ఆయన తరఫున ప్రచారం కూడా చేసేందుకు రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఐతే మల్కాజ్‌గిరి స్థానం నుంచి కాంగ్రెస్‌లో భారీ పోటీ కనిపిస్తోంది. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో.. కాంగ్రెస్‌లో బడాబడా నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్‌ సొంత తమ్ముడు కూడా.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరి కంచర్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా.. అల్లు అర్జున్‌ను ఎన్నికల ప్రచారంలో చూస్తామా అంటే.. వెయిట్ అండ్ వాచ్ అంతే !