మాజీమంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 17,18,19 తేదీలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టారని మండిపడ్డారు. ఐ టీడీపీ పెట్టిన పోస్ట్ లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు. పట్టాభిపురం స్టేషన్ లో 5 ఫిర్యాదులు, మరొక స్టేషన్లో మరో 5 ఫిర్యాదులు చేశామన్నారు. మూడు పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలు తెలుసుకోడానికి వెళ్తే కనీసం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీసుల ఇప్పటివరకు మేము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదన్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి రీమాండ్ చేశారన్నారు. కానీ మా వైసీపీ నాయకుల పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టిన వారి పై ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. వైసీపీ కార్యకర్తల పై సుమారు 300 కేసులు నమోదు చేశారన్న ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియా యాసీకివీస్ట్ లను ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు. మా కేసులు కనుక తీసుకోకపోతే న్యాయస్థానం కి వెళ్లి చట్ట పరంగా పోరాడతామన్నారు. మేము ఆధారాలు చూపించి ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు రిజిస్టర్ చేయట్లేదన్నారు.