Pawan Kalyan: ఏ రాజకీయ నాయకుడికి లేని ప్లస్ పాయింట్.. పవన్ కల్యాణ్‌కు ఉంది. అదే సినిమా. దీన్ని మైనస్ చేసేందుకు ప్రత్యర్థులు ఆడే ఆట అంతా ఇంతా కాదు. ఇదంతా వదిలేస్తే.. బ్రో మూవీ రిలీజ్ అయింది. పవన్ లుక్, యాక్షన్ చూసి.. ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆరు నెలలుగా పూర్తిగా పొలిటికల్ మూడ్‌లోనే కనిపిస్తున్న పవన్ కల్యాణ్.. బ్రో మూవీలోనూ పొలిటికల్ మసాలా దట్టించాడు. వాళ్లు వీళ్లు అని కాదు.. అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. కాదు కాదు ఏకిపారేశాడు. పేరడీలతో పేకాడేశాడు.
పవన్ ఎప్పుడు ఏ మాట మాట్లాడినా.. వెంటనే మైక్ ముందు వినిపించే గొంతు.. అంబటి రాంబాబుది..! బ్రో మూవీలో అంబటిని ఆడుకున్నారు గురూ.. అలా ఇలా కాదు. అంబటి రాంబాబు కనిపించేలా శ్యాంబాబు అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి.. సినిమాలోనూ అంబటిని టార్గెట్ చేశాడు పవన్. సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు వేసిన డాన్స్‌లాంటి డ్యాన్స్.. బ్రో మూవీలో కూడా ఉంది. శ్యాంబాబు పేరుతో 30 ఇయర్స్ పృథ్వీ ఆ పాత్రలో యాక్ట్ చేశాడు. సంక్రాంతి సంబరాల్లో అంబటి ఎలాగైతే డాన్స్ చేశారో.. ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అదే మేకోవర్‌లో కనిపించాడు పృథ్వీ. వైట్ అండ్ బ్లూ కలర్ టీషర్ట్, నైట్‌ప్యాంట్‌లో అంబటి సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేస్తే.. అదే కలర్ బట్టల్లో పృధ్వీ కనిపించాడు.
అంబటి వేసినట్లే స్టెప్పులు వేస్తుంటే.. పృథ్వీని పవన్ ఆపి శ్యాంబాబు ఆ డాన్స్ ఏంటి… వస్తున్న టెంపో ఏంటి.. నువ్వు చేస్తున్న స్టెప్ ఏంటి.. తకిట తకిటత 68, తకదిమి తకదిమిత 24అంటూ చేసిన సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడితో ఆగారా అంటే.. నెక్ట్స్ ఏంటి అని పవన్ అడిగితే.. సె అంటూ శ్యాంబాబు చెప్తాడు. ఎప్పుడూ దాని గురించే ఆలోచనా.. కళల్ని, లలిత కళల్ని మాలాంటి కళాకారుల కోసం వదిలేయండి అంటూ పవన్ డైలాగ్ ఎండ్ చేస్తాడు. నీకు ఎప్పుడు సెక్స్ గొడవేనా.. లైఫ్‌లో ఇంక వేరే పని లేదా అంటూ.. ఇండైరెక్ట్‌గా అంబటిని ఏకిపారేశాడు పవన్ స్టార్. రాజకీయాలు కాస్త తెలిసిన ఎవరికైనా.. ఈ శ్యాంబాబే.. ఆ అంబటి రాంబాబు అని గుర్తు పట్టడానికి క్షణం కూడా పట్టదు. పవన్, అంబటి వార్ చూసినవాళ్లయినా సరే.. సీన్‌కు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అయిపోయారు కూడా..! ఈ విషయం మంత్రివరకు కూడా వెళ్లిందట. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
అమెరికాలో ఉంటున్న అంబటి కూతురు కూడా.. ఈ సినిమా చూసి బ్రో మూవీలో మీ కేరక్టర్ ఉంది అని అంబటికి కాల్ చేసి మరీ చెప్పిందట. నిజానికి అంబటిని పోలి ఉన్న కేరక్టర్‌తో డ్యాన్స్ చేయించారు అని ముందే తెలుసు. దీన్ని ఆపేందుకు అంబటి కూడా ప్రయత్నాలు చేశారు. ఐతే అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అంబటి రాంబాబు పంపిన దూత మాట కూడా.. పవన్ వినలేదు.