పవన్ ప్లానింగ్ అదుర్స్, టీ-జనసేన చీఫ్ గా మాజీ క్రికెటర్ ఫైనల్

తెలంగాణాలో ఇప్పుడు జనసేన యుద్దానికి సిద్దమవుతోంది. ఏపీలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టిన జనసేన ఇప్పుడు తెలంగాణా రాజకీయాల మీద ఫోకస్ పెంచింది. తెలంగాణాలో పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 20, 2024 / 07:33 PM IST

తెలంగాణాలో ఇప్పుడు జనసేన యుద్దానికి సిద్దమవుతోంది. ఏపీలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టిన జనసేన ఇప్పుడు తెలంగాణా రాజకీయాల మీద ఫోకస్ పెంచింది. తెలంగాణాలో పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలెక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన కూడా ఎన్డియేలో భాగం కానుంది. ఏపీ ఫార్ములాను తెలంగాణాలో కూడా అమలు చేయాలని ఎన్డియే భావిస్తోంది. అందుకే పవన్ ను అక్కడ కూడా రంగంలోకి దించుతున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణాలో పవన్ కళ్యాణ్… పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టలేదు. ఎపీతో పోలిస్తే పవన్ తెలంగాణాలో చేసిన పర్యటనలు చాలా తక్కువ. ఎప్పుడో గెస్ట్ గా వెళ్ళడమే గాని పెద్దగా పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పర్యటనలు చేసింది తక్కువే. ఇప్పుడు తెలంగాణాలో బిజెపి ఎలా అయినా గవర్నమెంట్ ఫాం చేయాలని ప్లానింగ్ తో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడం ఖాయంగా కనపడుతోంది. టీడీపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద గురిపెట్టింది.

త్వరలోనే ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకునే ఛాన్స్ కనపడుతోంది. ఇప్పటికే వారి నుంచి క్లారిటీ వచ్చేసింది కూడా. వీటిని అబ్జర్వ్ చేస్తున్న పవన్ కళ్యాణ్… తాను కూడా గేమ్ స్టార్ట్ చేయాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్ర జనసేన చీఫ్ ని అలాగే… జిల్లా, బూత్ కమిటీలను ఫైనల్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా అధ్యక్షుడిగా ఎవరిని ఫైనల్ చేస్తారనేది స్పష్టత రాలేదు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ ను ఫైనల్ చేస్తారనే టాక్ కూడా వచ్చినా ముందుకు అడుగులు పడలేదు.

ఇప్పుడు మాత్రం ఫైనల్ చేసినట్టు టాక్. కాని సాయి ధరమ్ తేజ్ ను కాదు… మాజీ టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడుని. అంబటి రాయుడు ఏపీలో వైసీపీలో జాయినా అయినా వెంటనే రాజీనామా చేసారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ వార్తల్లో నిలిచారు. కాని ఎన్నికల తర్వాత మాత్రం సైలెంట్ అయ్యాడు అంబటి రాయుడు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల వైపు సీరియస్ గా ఉన్నాడని త్వరలోనే ఎంట్రీ ఇస్తాడని టాక్.

జనసేన పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అయి… ఆ తర్వాత తెలంగాణా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు అని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా… యూత్ లో ఫాలోయింగ్ ఉంది. రాజకీయాల్లో యువకుడు కావడంతో పవన్ కూడా వాడుకోవాలని చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయించాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి అంబటి రాయుడు పోటీ చేయనున్నాడు.