Ambati Rayudu: వైసీపీలో చేరనున్న అంబటి రాయుడు..! వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారో.. అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 17, 2023 / 12:49 PM IST

ఎన్నికల సీజన్ దగ్గర పడుతోంది. అందుకే ఆశావహులంతా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఏ పార్టీలో చేరాలి.. ఏ పార్టీలో చేరితే సీటు దక్కుతుంది.. ఏ స్థానం అయితే బెటర్.. లాంటి లెక్కలన్నీ వేసుకుంటున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఒక పార్టీని ఎంచుకుని దాని కండువా కప్పుకుంటున్నారు. ఎన్నికల సీజన్లో ఇలాంటి సీన్లు సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంక ఏడాది మాత్రమే సమయం ఉండడంతో చాలా మంది సేఫ్ జోన్ కోసం చూసుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు, రావాలనుకునే వాళ్లు లెక్కలేసుకుంటూ బిజీగా ఉండిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన అంబటి రాయుడు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని వివాదాల వల్ల మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి ఐపీఎల్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చాలాకాలం క్రితమే అంబటి రాయుడు వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరతారో.. అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పగానే పలు పార్టీల నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లారు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన పార్టీ నేతలు ఆయన్ను సంప్రదించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడైన తోట చంద్రశేఖర్ .. తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంబటిరాయుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే అయినా.. తన క్రికెట్ కెరీర్ అంతా తెలంగాణ నుంచే సాగింది. దీంతో బీఆరెస్ లో చేరారని ఆహ్వానించారు. అయితే రాయుడు మాత్రం ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. తాను ఏ పార్టీలో చేరబోయేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

https://www.instagram.com/reel/CrF3hc0Li5B/?utm_source=ig_web_copy_link

అయితే తాజాగా అంబటి రాయుడు ఇన్ స్టా గ్రామ్ లో ఓ రీల్ పోస్ట్ చేశారు. అంబేద్కర్ జంయతి సందర్భంగా సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లవ్లీ ట్రిబ్యూట్ టు అంబేద్కర్ … అని క్యాప్షన్ జత చేశారు. దీంతో అంబటి రాయుడు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంబటి రాయుడిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టు ద్వారా తాను వైసీపీలో చేరబోతున్నాననే సంకేతాలను అంబటి రాయుడు ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడొచ్చు.