AMBATI RAYUDU: పొలిటికల్‌ ఇన్నింగ్స్‌.. గుంటూరు ఎంపీగా బరిలోకి అంబటి రాయుడు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 08:01 PM IST

AMBATI RAYUDU: మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఇప్పుడు పొలిటికల్‌ లీడర్‌ అంబటి రాయుడుగా మారిపోయాడు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన రాయుడు.. వైసీపీలో చేరాడు. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

Ranbir Kapoor: వివాదంలో రణ్‌బీర్ కపూర్.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు

ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నాడు. నిజానికి చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యా రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఇంప్రెస్ అయ్యి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలో ప్రకటించాడు. నాడు-‌‌నేడు, స్పోర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని.. ఆ విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని గతంలో అంబటి రాయుడు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని రాయుడు ఇదివరకే నిర్ణయం తీసుకున్నాడు.

ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాడు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. ఆ ఎన్నికలో గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌ ఎంపీగా గెలిచారు. దీంతో ఈసారి ఖచ్చితంగా గుంటూరు స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి అంబటిని పోటీలో దింపేందుకు సీఎం జగన్‌ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్రికెటర్‌గా తన మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న అంబటి రాయుడు పొలిటీషియన్‌గా ఎలాంటి రిజల్ట్‌ చూపిస్తాడో చూడాలి.