Amit Shah: టీడీపీకి షాక్‌.. 70సీట్లు ఇస్తేనే పొత్తు.. చంద్రబాబుకు బీజేపీ షాక్‌..

టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఫైనల్ కాలేదు. లిస్ట్ అనౌన్స్‌ చేద్దాం అనుకునే సమయానికి ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి కాల్ రావడంతో చంద్రబాబు వెళ్లడం.. ఆ నెక్ట్స్‌ డే జగన్‌ కూడా మోదీతో భేటీ కావడంతో.. రాజకీయం మరింత రంజు మీద కనిపించింది.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 05:35 PM IST

Amit Shah: ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. కనిపించేది గోరంత.. తెరవెనక జరుగుతోంది కొండంత అన్నట్లుగా ఉన్నాయ్‌ పార్టీల వ్యూహాలు. ఇంచార్జిలను మారుస్తూ ఎన్నికలకు సిద్ధం అని జగన్ సవాల్ విసురుతుంటే.. మేము సిద్ధమే అని టీడీపీ, జనసేన అంటున్నాయ్. పొత్తుల ఎత్తులు.. వ్యూహాల కత్తులు.. వేడెక్కిన రాజకీయం.. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఏపీ రాజకీయం పరిస్థితి ఇది! వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఫైనల్ కాలేదు.

Nitish Kumar: బిహార్‌లో అవిశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్..

లిస్ట్ అనౌన్స్‌ చేద్దాం అనుకునే సమయానికి ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి కాల్ రావడంతో చంద్రబాబు వెళ్లడం.. ఆ నెక్ట్స్‌ డే జగన్‌ కూడా మోదీతో భేటీ కావడంతో.. రాజకీయం మరింత రంజు మీద కనిపించింది. బీజేపీని పొత్తులోకి తీసుకు వస్తా అని పవన్ పదే పదే చెప్తున్న వేళ.. అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ రాజకీయంగా ఆసక్తి రేపింది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయితే జరిగింది కానీ.. పొత్తు విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. బీజేపీ, జనసేనకు కలిపి 70 సీట్లు కావాలని చంద్రబాబు ముందు అమిత్ షా ఓ ప్రతిపాదన పెట్టారనే ప్రచారం.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఇదే నిజం అయితే చంద్రబాబుకు పెద్ద షాక్‌గా మారడం ఖాయం. ఒకరకంగా బీజేపీ చేతుల్లో సైకిల్ పార్టీ ఇరుక్కున్నట్లే అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో.. ఫోర్‌ ఈస్ట్ టు ఈస్ట్ వన్‌ (4‌:2:1) ఫార్ములాను చంద్రబాబు ముందు అమిత్‌ షా పెట్టారని తెలుస్తోంది. ఈ నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ పట్టు పట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ నిష్పత్తి ప్రకారం అంటే.. టీడీపీ వంద సీట్లు.. జనసేన 50 సీట్లు, బీజేపీ 25 సీట్లు కేటాయించాలి. అమిత్ షా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన.. చంద్రబాబుకు ఒకరకంగా షాక్‌ ఇచ్చినట్లే ! జనసేనకు 25 నుంచి 28 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో షా పెట్టిన ప్రతిపాదనతో.. చంద్రబాబు ఇరుకున పడినట్లు అయింది. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అయ్యే చాన్స్ ఉంది. అంగీకరించకపోతే బీజేపీ పెద్దలతో దూరం పెరుగుతుంది. దీంతో టీడీపీ ఏం చేస్తుందా అని వైసీపీతో సహా ఏపీ జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.