రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి సీతక్క వినూత్న నిర్ణయం

ఇప్పటి వరకూ పెంకుటిళ్లలో స్కూల్స్‌ను చూశాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో స్కూల్స్‌ని కూడా చూశాం. కానీ కంటైనర్‌లో స్కూల్‌ని ఎప్పుడైనా చూశారా. తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఈ కంటైనర్‌ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 02:04 PM IST

ఇప్పటి వరకూ పెంకుటిళ్లలో స్కూల్స్‌ను చూశాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో స్కూల్స్‌ని కూడా చూశాం. కానీ కంటైనర్‌లో స్కూల్‌ని ఎప్పుడైనా చూశారా. తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఈ కంటైనర్‌ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ స్కూల్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో ఓ ప్రభుత్వ పాఠశాలను ఇలా కంటైనర్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ కంటైనర్ స్కూల్ ప్రారంభించిన తర్వాత.. సీతక్క టీచర్‌గా మారారు. కాసేపు స్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ అక్షరమాలను బోధించారు.

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావ‌స్తకు చేరుకుంది. అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారంచుట్టారు. అయితే ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా ఉన్న ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని తాడ్వాయి మండ‌లంలో కంటెయిన‌ర్ ఆసుప‌త్రిని సీతక్క అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీంతో స్థానిక ప్రజ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభించారు. ఇక, ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా.. వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్యవంతంగా కూర్చునే విధంగా కంటైనర్ పాఠ‌శాల‌ను అందుబాటులోకి తెచ్చారు. 13 లక్షలతో ఈ కంటైనర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటివే మరో రెండు స్కూళ్లను కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు మంత్రి సీతక్క.