ANCHOR SHYAMALA: నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ల కుటుంబ సమస్యలు తెలుగు ప్రజలకు తెరిచిన పుస్తకం. చాలా కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆ కుటుంబం దూరంపెట్టింది. కొంత కాలంగా ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. ఆ కుటుంబానికి సంబంధించిన మేజర్ ఈవెంట్స్‌లో ఎన్టీఆర్ కనిపించడంలేదు. సీనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో తప్ప దేంట్లోనూ పాలు పంచుకోవడంలేదు.
దీంతో ఈ గ్యాప్ గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుకున్నారు. రీసెంట్‌గా చంద్రబాబు అరెస్ట్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అంతా రోడ్లపైకి వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ కాదు కదా.. రియాక్షన్ కూడా రాలేదు. దీంతో ఎన్టీఆర్ టీడీపీని కూడా వదిలేశాడనే వాదన మొదలైంది. దీనిపై మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఆయన పార్టీ సమస్యల్లో ఉంటే ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని ఒక వర్గం మీడియా ఖండించింది. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలి అంటూ ప్రోగ్రాం చేసింది. ఈ కార్యక్రమంపై యాంకర్ శ్యామల ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది. జూనియర్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేసింది.
“ఒకసారి నమ్మి మోసపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ ప్రపంచం తనవైపు చూసేలా కెరీర్‌లో ముందుకు వెళుతున్నాడు. ఆయనను అలా ప్రశాంతంగా వదిలేయండి. మీకు సపోర్ట్‌గా ఉంటే ఒకలాగా.. లేకపోతే ఇంకోలాగా ఎందుకు మాట్లాడుతున్నారు” అంటూ మీడియా సంస్థకు లెఫ్ట్, రైట్ ఇచ్చేసింది. ప్రస్తుతం శ్యామల చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌కు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ రీట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు.