మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరించారు. రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేశా…నారాయణ విద్యాసంస్థల జోలికి వెళ్లలేదు అన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. అధికారంలోకి ఈ మూడు నెలల్లోనే అనేకమంది వైసిపి నేతలు కార్యకర్తలను బెదిరించారు అని మండిపడ్డారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుని ఉంటే నారాయణ విద్యాసంస్థలు ఉండేవా అని నిలదీశారు. దసరా నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటా అని స్పష్టం చేసారు. కార్యకర్తలను రక్షించుకుంటాం…అండగా ఉంటామన్నారు.