Anil Ravipudi Political Entry : రాజకీయాల్లోకి అనిల్ రావిపూడి..త్వరలో కొత్త పార్టీ !

తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్న పార్టీలు సరిపోలేదా మళ్లీ కొత్త పార్టీ ఏంటి ? ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వెలుగుతున్న సమయంలో హాయిగా సినిమాలు తీసుకోక ఈ రాజకీయాలు అవసరమా ? ఆ గెటప్ ఏంటి ఆ డైలాగ్స్ ఏంటి ? అనిల్ రావిపూడి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారుతున్నాడు ?

తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్న పార్టీలు సరిపోలేదా మళ్లీ కొత్త పార్టీ ఏంటి ? ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వెలుగుతున్న సమయంలో హాయిగా సినిమాలు తీసుకోక ఈ రాజకీయాలు అవసరమా ? ఆ గెటప్ ఏంటి ఆ డైలాగ్స్ ఏంటి ? అనిల్ రావిపూడి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారుతున్నాడు ? త్వరలో కొత్త పార్టీ పెడుతున్నానని చెబుతున్నాడంటే చాలా సీరియస్ గానే ఉన్నట్టున్నాడు.. ఇంతకీ ఏంటీ రావిపూడి రాజకీయం..

Pakistan: పాకిస్తాన్‌కు మరో చిక్కు.. లాహోర్ నుంచి జనం పరుగులు

డైరెక్టర్ అనిల్ రావిపూడి పొలిటికల్ గెటప్ లో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. పాలిటిక్స్ లోకి వస్తున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పడం ఇందులో ఇంట్రెస్టింగ్. టాలీవుడ్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. రీసెంట్ గా బాలయ్యను ‘భగవంత్ కేసరి’ గా చూపించి మరో హిట్టందుకున్నాడు. ‘భగవంత్ కేసరి’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇస్తాడనుకుంటే..పొలిటికల్ లుక్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి షాకిచ్చాడు.

Gandhi Bhavan : గాంధీభవన్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్.. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయి..

ఆ వీడియోలో ఏముందంటే..”నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్ చేశారు. నేను ఎంటర్టైన్ చేశాను, మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈసారి నాకు గెలుపు థియేటర్లో కాదు. అసెంబ్లీ..ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. బాక్సాఫీస్ సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది. మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్ఫర్మేషన్ తో త్వరలో వస్తా” అంటూ ఆ వీడియోలో చెప్పాడు. ఇదిప్పుడు నెట్టింట్లో తెగ తిరిగేస్తోంది.. ఇంతకీ రావిపూడి పొలిటికల్ గెటప్ వెనుకున్న అసలు కథేంటంటే.. రావిపూడి నిజంగా పాలిటిక్స్ లోకి రావడం లేదు. ఇదంతా ఓ షో కోసం చేసిన ప్లాన్ . తెలుగు ఓటీటీ ‘ఆహా’ దీన్ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తుండడంతో పొలిటికల్ కాన్సెప్ట్ తో ఓ షో ప్లాన్ చేస్తున్నారని, దానికి అనిల్ రావిపూడి హోస్ట్ అని టాక్. అందులో భాగంగానే ఈ ప్రోమోని రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ‘భగవంత్ కేసరి’ తర్వాత అనిల్ రావిపూడి రవితేజతో మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మూవీ సీక్వెల్ ని కొందరు, కాదు కాదు కొత్త కథ అని మరికొందరు చెబుతున్నారు. రవితేజతో మూవీ కంప్లీట్ అయ్యాక మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి.. ఓటీటీలో ఇరగదీయబోతున్నాడన్నమాట.. ఇంతకీ పొలిటికల్ గెటప్ షో కోసమే కదా..!