Chandrababu Naidu: చంద్రబాబుకు షాక్.. మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులపై మరో కేసు నమోదు..

సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక అటు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు 50 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 07:09 PM IST

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస కేసులతో చంద్రబాబు సతమతమవుతున్నారు. ఇప్పుడు ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక అటు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు 50 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. స్కిల్ స్కాం కేసు విచారణ కొనసాగుతుండగానే.. సీఐడీ ఇప్పుడు మరో షాక్‌ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఆ తర్వత ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ నిందితుడిగా చేర్చింది సీఐడీ. ఈ కేసులతోపాటు అంగళ్లు దాడి కేసు, విజయనగరంలో కేసు.. ఇలా వరుస కేసులు చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నాయ్. ఇప్పటికే ఇన్నర్‌ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్ కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ పీటీ వారెంట్ కూడా దాఖలు చేసింది. చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే టీడీపీ శ్రేణులు నిరుత్సాహంలో మునిగిపోయాయ్.

సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు జైల్లో ఉండడం.. టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వైసీపీ బస్సు యాత్రలు మొదలుపెట్టింది. ఐతే టీడీపీ మాత్రం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం దగ్గర ఆందోళనలకే పరిమితం అయింది. ఇది రాబోయే కాలంలో కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.