YSRTP : షర్మిల ఔట్ ! పోటీ నుంచి తప్పుకున్న YSRTP

తెలంగాణ ఎన్నికల బరి నుంచి మరో పార్టీ తప్పుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు YSR TP చీఫ్ షర్మిల. కేసీఆర్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు.

( Telangana elections ) తెలంగాణ ఎన్నికల బరి నుంచి మరో పార్టీ తప్పుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు YSR TP చీఫ్ షర్మిల ( YS Sharmila ) . కేసీఆర్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు.

Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌.. అక్కడి నుంచి పోటీ..

రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వొద్దని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను అడిగారనీ… ఓటు బ్యాంకు చీలకుండా ఉంటే కాంగ్రెస్ కు ఒక చాన్స్ ఉంటుందన్నారు షర్మిల. YSR తీర్చిదిద్దిన కాంగ్రెస్ పార్టీని.. ఆయన బిడ్డే ఓడించడం కరెక్ట్ కాదని చెప్పడంతో… పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలోనూ విజయం సాధిస్తుందన్నారు షర్మిల. సోనియా గాంధీ, రాహుల్ ఆహ్వానంతో ఢిల్లీకి వెళ్ళి కలిశానని చెప్పారు.

కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు షర్మిల. కట్టిన కొన్ని రోజుల్లోనే మేడిగడ్డ కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జోక్ అని మరోసారి జనానికి అర్థమైందని అన్నారు. KCR చదివిన 80 వేల పుస్తకాల్లో ఇంజనీరింగ్ బుక్స్ లేవా అని ప్రశ్నించారు షర్మిల. KTR ఇప్పుడు TSPSCని ప్రక్షాళన చేస్తామని చెప్పడం ఏంటి… మేం పోరాటం చేసి… లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేదాకా మీకు తెలియదా.. TSPSC ట్రాన్స్ పెరెంట్ గా ఉంటే పేపర్లు ఎలా లీక్ అయ్యాయని అడిగారు షర్మిల. 9యేళ్ళల్లో కేసీఆర్ ఎన్నో అక్రమాలు చేశారు. అందుకే ఆయన మళ్ళీ సీఎం కావొద్దనే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.

BIGG BOSS : రసపట్టు.. బాల్ పట్టు.. అమర్ రతిక శివాజీ గౌతమ్ మధ్య డైలాగ్ వార్

తాను పాలేరు నుంచి పోటీ చేసి… ఎమ్మెల్యే అవుదామని అనుకున్నాననీ… కానీ సాధ్యం కాలేదన్నారు. పాలేరు ప్రజలకు షర్మిల క్షమాపణలు చెప్పారు. అక్కడి నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. 2013లో పాదయాత్ర చేసినప్పుడు… పొంగులేటి తనతో కలసి నడిచారనీ… ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్నారు. ఆయన కోసం ప్రచారం కూడా చేశాం… ఇప్పుడు పొంగులేటిపై తాను పోటీ చేయడం కరెక్ట్ కాదన్నారు. గెలుగు గొప్పదే అయినా త్యాగం అంతకంటే గొప్పది అన్న షర్మిల…పాలేరు ఓటర్లు తనను క్షమించాలని కోరారు. 3 వేల 800 కిలోమీటర్లు పాదయాత్రతో ప్రభుత్వంపై పోరాటం చేసి ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం బాధగా ఉందన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల.