BRS : కేసీఆర్‌కు మరో షాక్‌.. రేవంత్‌ను కలిసిన BRS మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో (Telangana) అధికారం కోల్పోయిన తరువాత బీఆర్‌ఎస్‌ (BRS) కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుటికే నలుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) నికి కలిసిన నేపథ్యంలో ఇప్పుడు మరో బీఆర్ఎస్ కీలక నేత కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు.

తెలంగాణలో (Telangana) అధికారం కోల్పోయిన తరువాత బీఆర్‌ఎస్‌ (BRS) కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుటికే నలుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) నికి కలిసిన నేపథ్యంలో ఇప్పుడు మరో బీఆర్ఎస్ కీలక నేత కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డిక తరువాత టికెట్‌ నిరాకరించింది బీఆర్ఎస్‌ పార్టీ. పార్టీలోకి కొత్తగా వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి (Sabita Indra Reddy) టికెట్‌ ఇచ్చింది.

దీంతో పార్టీకి దూరమయ్యారు కృష్ణారెడ్డి. అప్పటి నుంచీ ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారనే టాక్‌ నడుస్తోంది. కానీ దీని గురించి ఎప్పుడూ కృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణారెడ్డి సీఎంను కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చాలా మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తమకు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే రీసెంట్‌గా నలుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు.

దీంతో కాంగ్రెస్‌ చేస్తున్న వాదనకు మరింత బలం చేకూరింది. కానీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్‌ నేతల వాదనను కొట్టిపారేశారు. తమ నియోజకవర్గాల్లో ఉన్న అభివృద్ధి పనుల విషయంలోనే రేవంత్‌ను కలిసినట్టు చెప్పారు. వాళ్లు ఎందుకు కలిశారు అన్న విషయం కాసేపు పక్కన పెట్టినా.. ఆ ఇష్యూ ఇంకా ఎవరూ మర్చిపోకముందే ఇప్పుడు మరో కీలక బీఆర్ఎస్‌ నేత రేవంత్‌ను కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారని.. త్వరలోనే అధికారికంగా జాయిన్‌ కాబోతున్నారంటూ కాంగ్రెస్‌ వర్గాల నుంచి టాక్‌ వినిపిస్తోంది.