JAGAN TARGET : వాళ్ళ ఓటమికి జగన్ స్కెచ్..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) చంద్రబాబు(Chandrababu), లోకేశ్ , పవన్ కల్యాణ్(Pawan Kalyan)... ఈ ముగ్గుర్నీ ఓడించడానికి ఏపీ సీఎం జగన్ పక్కాగా స్కెచ్చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలు, వైసీపీని వదిలి వెళ్ళిన వారిని కూడా టార్గెట్ చేశారు. వీళ్ళందర్నీ ఓడించడానికి పార్టీ సీనియర్లను రంగంలోకి దించుతున్నారు.

 

 

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) చంద్రబాబు(Chandrababu), లోకేశ్ , పవన్ కల్యాణ్(Pawan Kalyan)… ఈ ముగ్గుర్నీ ఓడించడానికి ఏపీ సీఎం జగన్ పక్కాగా స్కెచ్చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలు, వైసీపీని వదిలి వెళ్ళిన వారిని కూడా టార్గెట్ చేశారు. వీళ్ళందర్నీ ఓడించడానికి పార్టీ సీనియర్లను రంగంలోకి దించుతున్నారు.

ఏపీలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం, నెల్లూరుపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడుతోపాటు వైసీపీని (YCP) వీడి టీడీపీ (TDP) లో చేరిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించాలన్నది ఆయన లక్ష్యం. కుప్పంలో ఏడు సార్లు గెలిచిన చంద్ర బాబు ఓటమికి మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు జగన్. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరును కూడా వదిలేసి… కుప్పంలోనే కుర్చీ వేసుకున్నారు. బాబుకు పోటీగా ఎమ్మెల్సీ భరత్ ను నిలబెడుతున్నారు. భరత్… మాజీ IAS అధికారి చంద్రమౌళి కొడుకు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్లో వైసీపీ గెలవడానికి ఈయనే కారణం. బాబును ఓడించి… భరత్ ను గెలిపిస్తే… మంత్రి వర్గంలో చోటిస్తానని కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు సీఎం జగన్.

లోకేశ్ (Nara Lokesh) పోటీ చేస్తున్న మంగళగిరిలో…నేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొదట గంజి చిరంజీవిని టీడీపీ నుంచి వైసీపీలోకి లాక్కొని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అయిన లావణ్యను పోటీకి దింపారు. గతంలో ఇక్కడ గెలిచిన ఆర్కే వైసీపీని వదిలి కాంగ్రెస్ కి వెళ్ళారు. తిరిగొచ్చిన ఆర్కే… అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థి మురుగుడు లావణ్య గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి కూడా చెక్ పెట్టడానికి డిసైడ్ అయ్యారు జగన్. ఆయన పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్న అంటున్నారు. ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎంపీ వంగా గీతను వైసీపీ పక్కన బెట్టే అవకాశాలు ఉన్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలో చేర్చుకొని పిఠాపురం నుంచి పవన్ పై పోటీకి దింపాలని భావిస్తున్నారు జగన్. తనకు ఎవరూ సలహాలు ఇవ్వొదని తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన కామెంట్స్ పై … ముద్రగడ లెటర్ రాశారు. ముద్రగడ జనసేనలో చేరే అవకాశం లేకపోవడంతో వైసీపీ నేతలు ముద్రగడ కొడుకు గిరితో మంతనాలు మొదలుపెట్టారు.

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కానీ ఆ జిల్లాలో ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో జాయిన్ అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ కూడా సైకిల్ ఎక్కారు. వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇస్తే… ఆయన టీడీపీలోకి వెళ్ళారు. దాంతో నెల్లూరు సీటును తిరిగి దక్కించుకోడానికి విజయసాయి రెడ్డిని దించారు జగన్. విజయసాయి రాజ్యసభ ఎంపీ. ఆయనకు 2028 దాకా సభ్యత్వం ఉంది. అయినా సరే… వేమిరెడ్డి ఓటమే టార్గెట్ గా జగన్ ప్లాన్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఇతర నేతలను గెలిపించే బాధ్యత కూడా విజయసాయికి అప్పగించారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులురెడ్డిని పక్కనబెట్టారు. ఊహించని విధంగా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ నిలబెట్టారు. మాగుంట కొడుకు రాఘవ రెడ్డికి ధీటుగా చెవిరెడ్డి పోటీ చేయబోతున్నారు. పార్టీని వీడిన ఎంపీలందరిపైనా గట్టి పోటీ పెడుతున్నారు జగన్. వీళ్ళే కాదు. అచ్చెన్నాయుడు లాంటి నేతలెవరూ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ప్రత్యర్థులకు చిక్కకుండా జగన్ ఆలోచనలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు.