AP Election Affidavits: చంద్రబాబు ఆస్తులు 931 కోట్లు, జనసేన మాధవికి 894 కోట్లు ! కళ్ళు తిరిగిపోతున్న ఆస్తుల చిట్టా

చంద్రబాబు నాయుడితో పాటు భువనేశ్వరి ఆస్తులు 2019లో రూ.668.57 కోట్లు ఉంటే, 2024 నాటికి రూ.931 కోట్లకు పెరిగాయి. ఇందులో చరాస్తులు రూ.810.41 కోట్లు, స్థిరాస్తులు రూ.121.41 కోట్లుగా ఉన్నాయి. ఇద్దరి ఆస్తుల్లో భువనేశ్వరికే ఎక్కువ వాటా ఉంది.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 03:05 PM IST

AP Election Affidavits: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలు అఫిడవిట్స్‌తో బయటపడుతున్నాయి. అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. గతంలో ఉన్న నేతల ఆస్తులు ఈసారి పెరిగిపోగా.. కొత్తగా బరిలోకి దిగిన లీడర్లు కూడా కోట్ల రూపాయల ఆస్తులను అఫిడవిట్‌లో చూపిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపున కుప్పం నియోజకవర్గంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ ఫైల్ చేశారు.

MS DHONI: మాస్.. ఊర మాస్.. ధోనీ ధనాధన్ బ్యాటింగ్

ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ కూడా సమర్పించారు. 2019లో ఆయన సమర్పించిన ఆస్తుల కంటే ఈసారి 41శాతం పెరిగాయి. ప్రస్తుతం బాబు ఆస్తులు విలువ రూ.810.42 కోట్లు. చంద్రబాబు నాయుడితో పాటు భువనేశ్వరి ఆస్తులు 2019లో రూ.668.57 కోట్లు ఉంటే, 2024 నాటికి రూ.931 కోట్లకు పెరిగాయి. ఇందులో చరాస్తులు రూ.810.41 కోట్లు, స్థిరాస్తులు రూ.121.41 కోట్లుగా ఉన్నాయి. ఇద్దరి ఆస్తుల్లో భువనేశ్వరికే ఎక్కువ వాటా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఆమెకు 2.26 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.337.85 కోట్లు. మొత్తం హెరిటేజ్ షేర్ల విలువ రూ.764 కోట్లు. భువనేశ్వరికి 24 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. కొత్తగా జనసేన తరపున విజయనగరం జిల్లా నెల్లిమర్ల అభ్యర్థిగా నిలబడిన లోకం మాధవి ఆస్తులు రూ.894 కోట్లు. మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయి. బ్యాంకుల్లో రూ.4.42 కోట్లు, చేతిలో క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయి. లోకం మాధవి చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ.2.69 కోట్లు అప్పులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు.

హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా నిలబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆస్తులు రూ.424 కోట్లు. వైఎస్సార్ సీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.236 కోట్లు. ఆయన ప్రస్తుతం పుంగనూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రస్తుతం రాజమండ్రి లోక్ సభ స్థానానికి YCP నేత గూడూరి శ్రీనివాస్‌తో పోటీ పడుతున్నారు. ఆమెతో పాటు భర్త దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆస్తుల విలువ రూ. 61.44 కోట్లు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి బుట్టా రేఖ. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.161 కోట్లు. కడప ఎంపీ సీటుకు వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మూడోసారి నిలబడుతున్నారు. అవినాష్ రెడ్డి, అతని కుటుంబ ఆస్తులు మొత్తం రూ.40.43 కోట్ల రూపాయలు.