TSPSC: టీఎస్పీఎస్సీ బోర్డులో ఏపీ వ్యక్తి.. కొత్త వివాదంలో రేవంత్ సర్కార్‌..

టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తికి చోటు కల్పించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఏపీకి చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డులో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 04:20 PM IST

TSPSC: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మార్పులు చకచకా జరిగిపోతున్నాయ్. కార్పొరేషన్‌ చైర్మన్లను తొలగించిన సీఎం రేవంత్.. పదవీ విరమణ తర్వాత కూడా విధుల్లో ఉన్న ఉద్యోగులను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ బదిలీలు కూడా జరిగాయ్. ఇవన్నీ ఎలా ఉన్నా.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ హయాంలో పేపర్‌ లీక్‌లు రచ్చరేపాయ్.

BRS-KCR: బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితమా..? జాతీయ రాజకీయాలకు దూరమేనా..?

నిరుద్యోగుల్లో కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత రావడానికి భారీ కారణం అదే! నిరుద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ప్రక్షాళన చేయాలని ఫిక్స్ అయింది. పాత సభ్యులంతా రాజీనామా చేయగా.. చాలారోజుల సస్పెన్స్ తర్వాత బోర్డుకు కొత్త అధ్యక్షుడిని నియమించింది రేవంత్ సర్కార్‌. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి బోర్డు బాధ్యతలు అప్పగించింది. ఐతే ఇప్పుడీ వ్యవహారం కూడా కొత్త రచ్చకు కారణం అవుతోంది. టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తికి చోటు కల్పించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఏపీకి చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డులో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రామ్మోహన్ రావుది.. కృష్ణా జిల్లా నందిగామ. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రాకి చెందినవాళ్లకు అవకాశం ఇవ్వడం ఏంటనే అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయ్.

రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా కావడంతో.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సమయంలో.. తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకడు. ఐతే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు. రామ్మోహన్ రావు ఈ మధ్యే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌ జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్లో పదవీ విరమణ కావాల్సిన ఆయనను.. టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తోంది.