నందిగం సురేష్ ను వెంటాడుతున్న మర్డర్ కేసు

మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు గుంటరు జిల్లా జైలులో ఉన్నారు

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 12:59 PM IST

మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు గుంటరు జిల్లా జైలులో ఉన్నారు. అయితే 2020లో మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ ను మరోసారి అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న మంగళగిరి కోర్టులో మర్డర్ కేసులో పిటి వారెంట్ ను పోలీసులు దాఖలు చేసారు.

పిటి వారెంట్ ను అనుమతించిన కోర్టు… కోర్ట్ లో హాజరు పరచాలని ఆదేశించింది. ఈ రోజు జిల్లా జైలు నుండి మంగళగిరి కోర్టుకు సురేష్ పిటి వారెంట్ పై పోలీసులు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా జైలు వద్దకు చేరుకున్న తుళ్ళూరు పోలీసులు… ఆయన విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తుళ్ళూరు పి ఎస్ లో మర్డర్ కేసు నమోదు అయింది.