నిన్న జెత్వాని, నేడు రఘురామ ఉచ్చు బిగిస్తుందా…?

గత ప్రభుత్వంలో చెలరేగిన అధికారులకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఉచ్చు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. తమను, తమ నేతలను వేధించిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

  • Written By:
  • Updated On - September 24, 2024 / 05:19 PM IST

గత ప్రభుత్వంలో చెలరేగిన అధికారులకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఉచ్చు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. తమను, తమ నేతలను వేధించిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇటీవల హీరోయిన్ జేత్వాని కేసులో ఉన్న ఐపిఎస్ అధికారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు కేసు వ్యవహారం మీద దృష్టి సారించింది.

తాజాగా రిటైర్డ్ ఏసీపీ విజయ్ పాల్ వ్యవహారంలో కీలక అడుగు పడింది. తనను అదుపులోకి తీసుకుంటారని భావించిన విజయ్ పాల్ కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్ట్. మాజీ ఎంపి, ఉండి ఎమ్మెల్యే పై కస్టోడియల్ టార్చర్ కేసులో… రిటైర్డ్ ఎసిపి విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన అరెస్ట్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే కనపడుతోంది.