AP Politics: పొత్తు పవన్‌కు మాత్రమే అవసరమా? టీడీపీ, జనసేన దోస్తీకి అడ్డు పడుతోంది ఏంటి?

ఆయనతో కలవడం ఈయనకు ఇష్టమే.. కానీ వాళ్లకు ఇష్టం లేదు. ఈయనతో కలవడం వాళ్లకు ఇష్టమే.. కానీ ఆయనను మాత్రం ఒప్పుకోరు. వాళ్లు ఉంటే వీళ్లు ఉండరు.. వీళ్లు ఉంటే వాళ్లు ఉండకూడదు. ఇంతకుముందు వాళ్లు వీళ్లు అంతా దోస్తులే.. కానీ ఇప్పుడే అంతా సీన్ ఆగం అయింది. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా.. ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కూడా దాదాపు ఇలానే ఉంది.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 07:00 PM IST

అన్నీ క్లియర్ అయ్యాయ్ అనుకున్న సమయంలో.. భారీ స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డొచ్చింది ఒకటి ! బీజేపీకి పవన్ దూరం జరుగుతున్నారు.. టీడీపీకి దగ్గరవుతున్నారు పొత్తు ఖాయం అనుకుంటున్న సమయంలో.. ఆయన ఢిల్లీకి వెళ్లి పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నింటిని తారుమారు చేశారు. దీంతో ఇప్పుడు పొత్తుల వ్యవహారంలో కొత్త కన్ఫ్యూజన్ మొదలైందిప్పుడు ! ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్‌.. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులపై వివరించారు. ఆవిర్బావ వేడుకల్లో తాను చెప్పిన మాటలనే.. హిందీ, ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చెప్పాడు దాదాపుగా ! వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని డిసైడ్ అయిన పవన్.. అదేవిషయాన్ని బీజేపీ పెద్దల ముందు ఉంచారు. ఈయన కొన్ని సూచనలు చేశారు.. వాళ్లు కొన్ని సలహాలు ఇచ్చారు.

కట్‌ చేస్తే జనసేన నేతలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వైసీపీని ఓడించేందుకు అందరూ కలిసి రావాలని అంటున్నారు గ్లాస్ పార్టీ నేతలు. టీడీపీని వదిలే చాన్స్‌ లేదు.. బీజేపీని వదులుకునే పరిస్థితి లేదు.. జనసేన పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. దీంతో అందరూ కలిసి పోరాడాలాని చాకచక్యంగా ప్రకటనలు చేస్తున్నారు జనసేన నేతలు. మరి ఇది సాధ్యం అవుతుందా అంటే.. కచ్చితంగా లేనే లేదు. రాష్ట్రంలో భావ వైరుధ్యం ఉన్న పార్టీలు ఉన్నాయ్. బీజేపీ ఉన్న చోట సీపీఎం, సీపీఐ ఉండవు. కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ ఉండదు. కానీ కాంగ్రెస్ ఉంటే కమ్యూనిస్టులు వస్తారు. అప్పుడు టీడీపీ చేరదు.

గతంలో పొత్తు పెట్టుకునే చంద్రబాబు దిద్దుకోలేని తప్పు చేశారు. దీంతో సైకిల్ దూరమే ! ఏపీలో ప్రస్తుత పరిణామాల మధ్య జనసేన, కమ్యూనిస్టులు, టీడీపీ పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయ్. జనసేన, బీజేపీతో పొత్తుకు టీడీపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇలాంటి పరిణామాల మధ్య పొత్తులు ఎలాంటి మలుపులు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి బీజేపీతో కలిసి పోరాడడం వల్ల.. జనసేనకు ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే.. జనసేనతో బీజేపీకి అవసరం తప్ప.. బీజేపీతో జనసేనకు అవసరం లేదు. అలా అని టీడీపీతో జనసేన కలిసేందుకు కమలం పార్టీ ఒప్పుకోవడం లేదు. ఇదే ఇప్పుడు అడ్డంకిగా కనిపిస్తోంది.

ఈ విషయంలో క్లారిటీ వచ్చేంత వరకు పొత్తుల వ్యవహారం తేలే చాన్స్ లేదు. ఇవన్నీ సమీకరణాలు వదిలేస్తే.. ఇప్పుడు పొత్తులు పవన్‌కు మాత్రమే అవసరం అన్నట్లు కనిపిస్తున్నాయ్. అసలే అంతంత మాత్రం బలం ఉన్న పార్టీ..వచ్చే ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగిలితే.. కోలుకోవడం, కోలుకొని నిలబడడం చాలా కష్టం. అందుకే వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌కు తప్ప పొత్తులు ఎవరికీ అవసరం లేదా అనే చర్చ జరుగుతోంది మరోవైపు ! ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ వర్గాల్లో జోష్‌ నింపింది. చంద్రబాబు కూడా గేర్‌ మార్చారు.. మాటల యుద్ధం మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. పార్టీకి కూడా మంచి మైలేజీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక బీజేపీ సంగతి సరేసరి ! వాళ్లకు గెలుపు మీద ఆశలేదు.. 2029 అంచనాలు తప్ప ! దీంతో పవన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న దాని మీదే పొత్తులు ఆధారపడి ఉంటాయ్. ఆ పార్టీ అడుగులు డిసైడ్‌ అవుతాయ్.