ఎలక్షన్స్ సరిగ్గా సంవత్సరం కూడా లేదు. ఇలాంటి టైంలో ఇలా నోరు జారితే వచ్చే ఎన్నికల్లో చిప్పే మిగులుతుందని ఏపీ మంత్రి జోగి రమేష్‌పై విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. నెల్లూరులోని పైడమ్మ కాలనీవాసులు తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి జోగి రమేష్ దగ్గరి వచ్చారు. 2014లో కాలనీ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకూ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయలేదని.. చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ బాధలు చెప్పుకున్నారు.
మొత్తం విన్న మంత్రి అధికారులతో మాట్లాడుతానంటూ బాధితులకు చెప్పాడు. ప్రతీ సారి చెప్పిన మాటే మరోసారి చెప్పడంతో అక్కడికి వచ్చిన బాధితుల్లో ఓ మహిళ మంత్రిని ప్రశ్నించింది. చాలా ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నారు. కానీ పరిష్కారం మాత్రం చూపించడంలేదని అడిగింది. వెంటనే మంత్రిగారు ఆవేశంతో ఊగిపోయారు. అరవద్దు, ఎక్కువ మాట్లాడొద్దు బయటికి పో అంటూ ఆ మహిళను బెదిరించారు.
స్పాట్ లో తీసిన వీడియో బయటికి రావడంతో జోగి రమేష్‌ను అంతా ఓ ఆట ఆడుకుంటున్నారు. సమస్యతో వచ్చిన వాళ్లను బయటికి పొమ్మంటే నువ్వెందుకు ఎమ్మెల్యేగా ఉన్నావంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు.