హీరోయిన్‌తో అఫైర్‌.. పెళ్లి చేసుకోమంటే కేస్‌

వరుసబెట్టి బయటకు వస్తున్న వైసీపీ నేతల రాసలీలలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు..

  • Written By:
  • Updated On - August 27, 2024 / 12:21 PM IST

ఒకడేమో వీడియో కాల్‌లో జిప్పు తీస్తాడు. ఇంకొకడేమో అరగంట చాలు వచ్చేయ్‌ అంటాడు. మరొకడేమో అన్నీ చేస్తుందా సుకన్యా అంటూ ఆరా తీస్తాడు. ఇవేమీ సినిమాల్లోని చిలిపి డైలాగులు కాదు. వరుసబెట్టి బయటకు వస్తున్న వైసీపీ నేతల రాసలీలలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు.. సకల కళా వల్లభులు అనిపించుకుంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా.. వీళ్లు చేసే నాటీ వేశాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే వేధింపుల ఆరోపణలతో తలపట్టుకుంటున్న వైసీపీ అధిష్టానానికి ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఐపీఎస్‌ అధికారితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ హీరోయిన్‌ను వేధించిన ఘటన దాదాపు ఆరు నెలల తరువాత వెలుగులోకి వచ్చింది. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ విషయాన్ని బయటికి రానీయకుండా వైసీపీ అగ్రనాయకత్వం అణచివేసింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే చాలా మంది తలరాతలు మారిపోతాయి. అలాగే ఈ వ్యవహారం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా వైసీపీకి చెందిన కుక్కల నాగేశ్వర్‌ రావు కొడుకు కుక్కల విద్యాసాగర్‌ రావు చేసిన బాగోతం ఇది. 2014లో పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విద్యాసాగర్‌.. ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లాడు విద్యాసాగర్‌. అక్కడే ముంబైకి చెందిన ఓ నటితో విద్యాసాగర్‌కు పరిచయం ఏర్పడింది. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా స్నేహితులుగా మారిన ఈ ఇద్దరూ.. కొన్ని రోజులకు మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. కొన్నాళ్లకే వీళ్ల పరిచయం ప్రేమగా కూడా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నటిని అన్ని విదాలా వాడుకున్నాడు విద్యాసాగర్‌. సాగర్‌ మాటలు నమ్మిన నటి అమాయకంగా అన్నీ అర్పించేసింది. చాలా కాలం వీళ్ల వ్యవహారం బాగానే కొనసాగింది. కానీ కొంత కాలానికి ఆ యాక్టర్‌ తనను పెళ్లి చేసుకోవాలంటూ విద్యాసాగర్‌ మీద ఒత్తిడి తెచ్చింది. కానీ అప్పటికే మంచి క్లారిటీతో ఉన్న విద్యాసాగర్‌ ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు. కానీ ఎలాగో తెలియదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అప్పటి ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. విద్యాసాగర్‌ను కాపాడేందుకు సజ్జల ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. వెంటనే అప్పటి విజయవాడ సిటీ కమిషనర్‌ కాంతిరాణాను పిలిచి విషయం మొత్తం చెప్పాడు.

ఇంకోసారి ఆ అమ్మాయి సాగర్‌ జోలికి రాకుండా ఏం చేయాలో అది చేయండని ఆదేశించాడు. ఇలాంటి వ్యవహారాల్లో అప్పటికే ఆరితేరిన రాణా ఓ పథకం రచించారు. వైసీపీ నేతలకు ఎల్లప్పుడూ అన్ని విధాలా సహకరించే ఆ ఆఫీసర్‌.. రివర్స్‌లో సాగర్‌తో హీరోయిన్‌ మీద కేస్‌ పెట్టించారు. హీరోయిన్‌ తనను హనీట్రాప్‌ చేసిందని. తన ఆస్తి కాజేసేందుకు ప్లాన్‌ వేసిందని కేసు పెట్టించారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా దీనికి సహకరించారంటూ వాళ్ల మీద కూడా కేసులు పెట్టించారు. వాళ్లను అరెస్ట్‌ చేసేందుకు ఓ టీంను రెడీ చేశారు. అప్పటి విజయవాడ డీసీపీ విశాల్‌ గున్నీ నేతృత్వంలో ఈ టీంను ముంబైకి పంపారు. పక్కా ప్లాన్‌తో ఓ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసినట్టు ఆ హీరోయిన్‌ను, వాళ్ల ఫ్యామిలీని అరెస్ట్‌ చేశారు. ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి వాళ్లను విజయవాడకు తీసుకువచ్చారు. కోర్టు వాళ్లకు రిమాండ్‌ విధించడంతో కొన్ని రోజులు వాళ్లు జైలులోనే ఉన్నారు. బెయిల్‌ మీద బయటకు వచ్చిన తరువాత హీరోయిన్‌ను, వాళ్ల కుటుంబాన్ని విద్యాసాగర్‌ మనుషులు బెదిరించారు. గెస్ట్‌హౌజ్‌లో బంధించి.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని.. లేదంటే చంపేస్తామంటూ భయపెట్టారు. ప్రభుత్వం వాళ్ల అండర్‌లో ఉంది అన్న విషయాన్ని గ్రహించిన హీరోయిన్‌ మారు మాట్లాడకుండా కుటుంబాన్ని తీసుకుని ముంబైకి వెళ్లిపోయింది. కానీ ఈ విషయం మాత్రం బయటకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం కావడంతో వ్యవహారం లీక్‌ అవ్వకుండా ఎక్కడికక్కడ మేనేజ్‌ చేసింది వైసీపీ అగ్రనాయత్వం. కానీ ప్రభుత్వం మారడంతో సజ్జల సహకారంతో విద్యాసాగర్‌ చేసిన ఈ అరాచకం ఇప్పుడు బయటికి వచ్చింది. ఐతే ఇదే కేసులో మరో టాక్‌ కూడా ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త జిందాల్‌ తనను రేప్‌ చేశాడంటూ ఇదే హీరోయిన్‌ కొంతకాలం క్రితం ముంబైలో పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చింది. విషయం బయటికి వస్తే తన పరువు పోతుంది అనుకున్న జిందాల్‌ తనకు సన్నిహితంగా ఉండే జగన్‌కు విషయం మొత్తం చెప్పాడు. జగన్‌ ఆదేశంతో సజ్జల విద్యాసాగర్‌ను ముందు పెట్టి ఈ వ్యవహారం మొత్తం నడిపించాడు అనే టాక్‌ కూడా ఉంది. చిన్న ఫ్రాడ్‌ కేసులో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు స్పెషల్‌ ఫ్లైట్‌లో ముంబై వెళ్లి అరెస్ట్‌ చేశారంటే అది ముఖ్యమంత్రి సహకారం, ఆదేశం లేకుండా జరిగే పని కాదు అనేది చాలా మంది వాదన. ఇందులో నిజం ఏదైనా.. ఓ అమ్మాయి విషయంలో వైసీపీ అగ్రనాయకత్వం చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో అతలాకుతలం అవుతున్న వైసీపీని ఈ వ్యవహారం మరింత కుదిపేసింది.