మరో కేసు, వైసీపీ ఎమ్మెల్సీకి మూడింది…?

నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ళ దాడి జరిగింది.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 05:15 PM IST

నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ళ దాడి జరిగింది. వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడికి పాల్పడిన వారిపై పోలీసులు ఇప్పుడు విచారణ ముమ్మరం చేసారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలు అయ్యాయి.

తాజాగా పోలీసులు కేస్ ను బయటికి తీసి విచారణ చేపట్టారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు.. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాత్ర పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.