బ్రేకింగ్: టాలీవుడ్ హీరో ఇంట్లో నక్కిన వర్మ…?

సినిమాలతో... సోషల్ మీడియా పోస్ట్ లతో రెచ్చిపోయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండ్ తీయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ... నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కాలర్ ఎగరేస్తున్న వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు.

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 04:48 PM IST

సినిమాలతో… సోషల్ మీడియా పోస్ట్ లతో రెచ్చిపోయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండ్ తీయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ… నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కాలర్ ఎగరేస్తున్న వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు. గత రెండు పర్యాయాలు విచారణ నుంచి తప్పించుకున్న వర్మను ఈసారి విచారణ కాకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు రెండు సార్లు వర్మ తప్పించుకోవడంతో అతని అరెస్ట్ కోసం హైదరాబాద్ వెళ్ళారు పోలీసులు.

టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేయగా… ఈ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్గోపాల్వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్ట్ కొట్టేసింది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేయడంతో వర్మ కుంటి సాకులు చెప్పడం మొదలుపెట్టారు. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా… తనకు 4 రోజుల సమయం కావాలంటూ ఆర్జీవీ అదేరోజు వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అనంతరం 25న ఉదయం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అదే వాట్సాప్ లో పంపించారు. అయినా సరే వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీనితో వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేసి హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్ళారు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో వర్మ… తమిళనాడులోని కోయంబత్తూరు పారిపోయాడు. ఆదివారం ఒక వివాహానికి హాజరు అయ్యాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. డిజిటల్ మోడ్‌లో విచారణకు హాజరవుతానని వర్మ రిక్వస్ట్ చేసినా పోలీసులు మాత్రం నో అంటూ రిప్లై ఇచ్చారు.

రామ్గోపాల్వర్మ కోరిన విధంగా రెండుసార్లు విచారణకు అంగీకరించి అవకాశం కల్పించినా సరే వర్మ… సద్వినియోగం చేసుకోలేదని, నోటీసులు ధిక్కరించినందునే అరెస్టు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల వర్మపై అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా… వర్మ మాత్రం తన లాయర్ ను విచారణకు పంపి… తనకు షూటింగ్ లు ఉన్నాయని రాలేను అని పోలీసులకు లాయర్ ద్వారా సమాచారం ఇచ్చారు. షూటింగ్ లు లేకపోయినా వర్మ… అప్పటికప్పుడు షెడ్యూల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఇదే సమయంలో వర్మ తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసాడు. అతని ఆచూకీ కోసం ఏపీ పోలీసులు రెండు బృందాలుగా హైదరాబాద్ వెళ్ళాయి. మరో రెండు బృందాలు తమిళనాడు, కోయంబత్తూరు వెళ్ళాయి. అయితే రామ్గోపాల్‌వర్మ హైదరాబాద్‌లోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వర్మ ఐపీ అడ్రస్ లు హైదరాబాద్ లోనే చూపిస్తున్నాయి. దీనితో శంషాబాద్, షాద్‌నగర్‌లోని 2 ఫాంహౌస్‌లపై పోలీసులు ఫోకస్ చేసారు. సోమవారం సాయంత్రానికి వర్మను ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు.

వర్మ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్ లో సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతనితో వర్మ ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అటు చెన్నై, ముంబై పోలీసుల సహకారం కూడా ఏపీ పోలీసులు కోరారు. అటు వర్మ లాయర్ తో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టు సమాచారం. వర్మపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనపడుతోంది. సోషల్ మీడియాలో చెలరేగిపోయే వర్మ పిల్లిలా పారిపోవడం ఏంటీ అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.