AP POLITICS: ఏపీలో ఆ ఆరు స్థానాలే కీలకం.. రాజకీయం అంతా అక్కడే..

ఏపీలోని ప్రధాన నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి. చంద్రబాబు అడ్డా ఇది. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో ఆ పార్టీని ఓడించాలని జగన్ తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఖర్చు చేసారు.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 05:10 PM IST

AP POLITICS: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పార్టీలన్నీ గ్రౌండ్‌ లెవల్‌ వర్క్‌ మొదలుపెట్టాయ్‌. నాయకులంతా జనాల్లోనే కనిపిస్తున్నారు. విజయమో.. వీర స్వర్గమో అన్న రేంజ్‌లో నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో.. ఆరు స్థానాలు హాట్‌టాపిక్‌గా మారాయ్‌. ఈ 6 నియోజకవర్గాలలో ఎక్కడ.. ఏ పార్టీ గెలుస్తుంది అనే చర్చ జరుగుతోంది.

TDP-BJP-JANASENA: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. ఆ పార్లమెంట్ స్థానం నుంచే పవన్ పోటీ..

ఏపీలోని ప్రధాన నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి. చంద్రబాబు అడ్డా ఇది. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో ఆ పార్టీని ఓడించాలని జగన్ తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఖర్చు చేసారు. గెలుపు సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబు మెజారిటీ తగ్గించినా అది గెలుపే అనే కాన్ఫిడెన్స్‌తో వైసీపీ కనిపిస్తోంది. పులివెందులలో జగన్‌కు షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కుప్పం, పులివెందులలో ఫలితాలను మార్చడం దాదాపు అసాధ్యం. ఈ రెండు స్థానాల సంగతి ఎలా ఉన్నా.. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించాలని వైసీపీ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది. ఇక అటు గుడివాడలో కొడాలినానిని ఓడించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు పవన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నుంచి పవన్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా.. నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బరిలో దిగబోతున్నారు.

పవన్‌ను ఓడించాలని వైసీపీ, విజయసాయిరెడ్డిని ఓడించాలని టీడీపీ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాయ్. 2024 ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. దీంతో ఏం జరుగుతుందో అనే ఆసక్తి కనిపిస్తోంది. సర్వేలు కూడా ఏపీలో ఏ పార్టీది అధికారం అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య ఏ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది.. అధికారం ఎవరికి దక్కబోతుందనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.