AP Politics: పవన్‌ చుట్టూ రాజకీయం.. జనసేనాని దారెటు ?

పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ టూర్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. రెండు రోజుల నుంచి బీజేపీ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఇంట్రస్ట్‌గా ఎదురుచూస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 06:30 PM IST

బీజేపీ అలయన్స్‌తో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినా.. చాలా రోజుల నుంచి బీజేపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య కుదరడంలేదు. పేరుకు పొత్తులో ఉన్నా.. ఎవరికి వారే అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరి ఎజెండా వాళ్లు ఫాలో అవుతున్నారు. దీనికి తోడు చాలా కాలంగా టీడీపీతో క్లోజ్‌గా ఉంటున్నారు పవన్‌ కళ్యాణ్‌. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఏపీ బీజేపీ నేతలు ఇంట్రస్ట్‌ చూపించడంలేదు. ఇదే విషయం పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ఆయనను ఢిల్లీకి పిలిపించారు బీజేపీ పెద్దలు. జనసేనతో కలిసి పని చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ టీడీపీతో పొత్తుకుంటే తమను మర్చిపోవాలని పవన్‌తో బీజేపీ హైకమాండ్‌ చెప్పినట్టు సమాచారం. ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం కూడా లేని ఇలాంటి టైంలో పవన్‌ను డిఫెన్స్‌లో పడేసింది బీజేపీ.

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చాలా వింత పరిస్థితి నెలకొంది. వైసీపీ మినహా ఏ పార్టీ సొంతంగా బరిలో దిగే పరిస్థితిలో లేదు. కాస్తో కూస్తో జనసేన పేరు ప్రజల్లో కాస్త బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీతో పొత్తు అటు టీడీపీకి, ఇటు బీజేపీకి అవసరమే. కానీ టీడీపీ ఉంటే బీజేపీ కలిసేందుకు రెడీగా లేదు. అటు పవన్‌ కల్యాన్‌కు ఇప్పుడు ఇద్దరి సహాయం అవసరమే. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఓట్‌బ్యాంక్‌ను చీలిపోనివ్వనని పవన్‌ ఇదివరకే చెప్పారు. అంటే బీజేపీతో పాటు టీడీపీని కలుపుకుని పోటీ చేస్తామని ఇండైరెక్ట్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కానీ పవన్‌ ఇండైరెక్ట్‌ స్టేట్‌మెంట్‌కు బీజేపీ నేతలు స్ట్రెయిట్‌గానే ఆన్సర్‌ చెప్తున్నారు. టీడీపీ ఉంటే తాము పొత్తు పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు బీజేపీని వదిలి కేవలం టీడీపీతో ఎన్నికలకు వెళ్తే బీజేపీ కారణంగా ఓట్‌బ్యాంక్‌ చీలిపోయే ప్రమాదముంది. అటు తిరిగి ఇటు తిరిగి అది వైసీపీకి మేలు చేస్తుంది. కేవలం బీజేపీతో వెళ్లినా టీడీపీ కారణంగా అదే జరుగుతుంది. ఇలాంటి టైంలో అంతా కలిసి పోటీ చేయడం తప్ప వేరే ఆప్షన్‌ లేదు. దీంతో ఇప్పుడు బీజేపీని, టీడీపీని కలిపే పనిలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ దీనికి బీజేపీ ససేమిరా అంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువ.

ఈ మూడు పార్టీల్లో జనసేన, టీడీపీ ఏపీలో కాస్త మంచి పొజిషన్‌లో ఉన్నాయి. బీజేపీ పొజిషన్‌ మాత్రం దారుణంగా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో బీజేపీకే పొత్తు చాలా ముఖ్యం. అటు టీడీపీ కూడా జనసేన పొత్తుకోసం ఇండైరెక్ట్‌గా వెయిట్‌ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై 2024 ఎన్నికల ఫలితారు ఆధారపడి ఉన్నాయి. పవన్‌ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించి టీడీపీని కలుపుకుపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాదని ఎవరికి వారు బరిలోకి దిగితే ఈసారి కూడా వైసీపీ గవర్నమెంట్‌ను ఫామ్‌ చేస్తుందంటున్నారు.