ఏపీలో మనుషుల కంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు. అదేంటి..అర్థంకాలేదా..? అంటే మనషుల లాగా ఆలోచించేవాళ్ల కంటే తమ పార్టీలకు ఊడిగం చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారన్నమాట. పచ్చిగా చెప్పాలంటే బానిసత్వం చేస్తుంటారని అర్థం. ఎవరికైనా డౌట్ ఉంటే టెస్టు చేసుకోండి..ఏదైనా విషయం గురించి వాళ్ల దగ్గర మాట్లడండి..పార్టీల ప్రస్తావన లేకుండా గంటసేపు వాళ్లు మాట్లాడితే కాలం ఆగిపోతుంది. చైనా ఎవర్ని కెలక్కుండా సైలెంట్‌గా ఉండిపొతుంది.. సినీ హీరో అభిమానులు కుక్కలని, నక్కలని బలివ్వకుండా ఉంటారు. ఇవ్వని ఎలాగైతే జరగవో..పార్టీల తరఫున కాకుండా మనుషుల్లాగా ఆలోచించేవాళ్లు అక్కడ దొరకరు. అందరూ ఇలానే ఉంటారని కాదు.. కానీ అలా ఉండేవారి వాళ్ల సామాన్యంగా ఉండే మనుషులు నలిగిపోతుంటారు. అందుకు గొప్ప ఉదాహరణే సచివాలయ ఉద్యోగులు.. ఎందుకంటారా..? అయితే రీడ్ థిస్ స్టోరీ..
ఇదేం దోపిడి..ఇదేం పని:
ఏపీలో చాలా మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు దాదాపు 20రోజులుగా వీక్ ఆఫ్‌లు లేవు. ఆదివారం కూడా ఆఫీస్‌లకు వెళ్తున్నారు. అంతా ‘సురక్ష’ కోసం అంటున్నారు. జగన్ గారి లెక్కలు, డప్పులు కోసం ఉద్యోగులు తిండీ, తిప్ప మానేసి పని చేయిల్సి వస్తోంది. అది కూడా ఆఫీస్ టైమ్‌లోనే అనుకుంటే మీరు జగనన్న మున్సిపాలిటీ చెత్త బండిలో కాలేసినట్టే..! ఉదయం లేవగానే పరుగు పరుగున వెళ్లాలి.. అర్థరాత్రి వరకు అక్కడే ఉండి తీరాలి.. ఆఖరికి ఆఫీస్‌కి వెళ్లే సమయంలోనూ ఒక్కటే మోత..అదే ఫోన్ కాల్స్ గోలా.. తీరా ఇంటికి వచ్చిన తర్వాతైనా రిలెక్స్ అవ్వడంలేదు.. అప్పుడు కూడా అదే పని చేయాల్సి వస్తోంది. నారాయణ, చైతన్య స్కూల్స్‌ల్లో టీచర్లను టార్గెట్స్ పేరిట స్టూడెంట్స్‌ని పట్టుకురమన్ని రోడ్లపైకి వదిలినటట్టు వీళ్లని ఎప్పుడు ఎక్కడికి వదులుతారో తెలియదు.. టార్గెట్ ఫీనిష్ అయ్యేవరకు అర్థరాత్రైనా పని చేయాల్సిందే. ఇలా అందరూ పడుకున్నాక ఇళ్లకి చేరుకోవడం.. ఉదయం ఎవరూ లేవకముందే ఆఫీస్‌లకు వెళ్లిపోతుండడంతో ఈ ఇంట్లో వాళ్లు ఇల్లు ఖాళీ చేశారేమోనని పక్కింటివాళ్లు అనుకునే అంతలా జగన్ అన్న ఉద్యోగులను చీల్చి చెండాడుతున్నాడు. ఆయన అభిమాన నటుడు బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా చూసిన తర్వాత ఈ తరహా ఆలోచనలు జగన్ మెదడులో గిర్రున తిరిగి ఉండొచ్చు. దాన్నే ఇప్పుడు అమలు చేస్తూ ఉండవచ్చు..అదే వేరే విషయం..! మరోవైపు 25వేల జీతం ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని జగన్ పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది గతంలో యూరోపియన్ సామ్రాజ్యం అనుసరించిన శ్రమ దోపిడిని గుర్తుకు తెస్తుందని వాపోతున్నారు. ఇంత శ్రమదోపిడి చేస్తున్నా.. తమ గురించి ఏ ఒక్క మీడియా సంస్థ కూడా రాయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లు ఎందుకు రాయడం లేదంటే..?
సచివాలయ ఉద్యోగుల వెట్టిచాకిరి చాలా మందికి తెలిసిన విషయమే..అయితే ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు రాయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్‌కి సంబంధించిన మీడియా ఎలాగో ఇది రాసే ఛాన్స్ లేదు. మరి టీడీపీ, జనసేన వర్గాలు ఈ శ్రమదోపిడిని ఎందుకు ప్రశ్నించడంలేదు..? దానికి చాలా బలమైన కారణముంది. సచివాలయ ఉద్యోగాలు జగన్ సృష్టించిన ఉద్యోగాలు..ఇటివలి కాలంలో పవన్‌స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టేజీలపై సచివాలయ ఉద్యోగులపై లాజిక్‌లెస్ కామెంట్స్ చేశారు. పంచాయితీలు ఉండగా గ్రామ సచివాలయలు ఎందుకంటూ ప్రశ్నించారు. పవన్ చదివిన 2లక్షల పుస్తకాల్లో దీనికి సంబంధించిన మేటర్ ఉండకపోవచ్చు..అది ఆయన తప్పే కాదు..గ్రామ సచివాలయాలు గాంధీ కలలుకన్న దేశానికి ప్రతిరూపాలు.. రోజులకు రోజులకు సర్టిఫికేట్ల కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగే రోజులు లేవిప్పుడు..అంతా సచివాలయాల నుంచే జరుగుతుంది. ఆఖరికి ఆధార్-పాన్ లింకింగ్‌లు కూడా ఏపీలో సచివాలయాల ఉద్యోగుల ద్వారానే జరిగింది. ఇప్పుడు వారి పని గొడ్డుచాకిరిగా మారిపోయింది. ఓ యంత్రంలా పని చేయాల్సిన పరిస్థితి దాపరించింది. ఈ విషయంలో జగన్‌ని కార్నర్ చేసే ఛాన్స్ ప్రతిపక్షాలకు పుష్కలంగా ఉన్నాయి.
అయితే ఈ శ్రమదోపిడి గురించి రాస్తే..చెబితే..అక్కడ సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని స్వయంగా అంగీకరించినట్టువుతుంది. గతంలో వాళ్లు చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకున్నట్టువుతుంది. అందులో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏపీలో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు కదా..వాళ్లంతా గతంలో సచివాలయ ఉద్యోగులకు పనిపాట ఉండదని కామెంట్స్ చేశారు.. ఇప్పుడు ఈ శ్రమదోపిడి గురించి రాస్తే వాళ్ల పచ్చకామెర్ల అభిప్రాయాలు బ్లాస్ట్ అవుతాయి.. అది జరగడం తెలుగు తమ్ముళ్లకు..గ్లాస్ వీరులకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందుకే వాళ్ల చావు వాళ్లు చస్తారులే అని పట్టించుకోవడంలేదు. ఇలా ఓవైపు గొడ్డుచాకిరితో మరోవైపు ప్రతిపక్షాల సూటిపోటి మాటలతో సచివాలయ ఉద్యోగులు ఇదేం కర్మరా బాబు అని తలలు కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.