AP, TS Elections :రెండు నెలల ఖర్చు తడిసి మోపెడు ! లబో దిబోమంటున్న అభ్యర్థులు !!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందన్న సంబరం ఉన్నా... పోలింగ్ డేట్ కి రెండు నెలల టైమ్ ఉండటంతో ఒక్కసారిగా డీలా పడ్డారు. మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది... ఇప్పటి నుంచి ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్ డేట్ దాకా రెండు నెలల టైమ్ ఉంటుంది. దాంతో ఈ 2 నెలల పాటు ప్రచారం నిర్వహించడం, అనుచరులను మొయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారనుంది.

  • Written By:
  • Updated On - March 16, 2024 / 06:28 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందన్న సంబరం ఉన్నా… పోలింగ్ డేట్ కి రెండు నెలల టైమ్ ఉండటంతో ఒక్కసారిగా డీలా పడ్డారు. మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది… ఇప్పటి నుంచి ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్ డేట్ దాకా రెండు నెలల టైమ్ ఉంటుంది. దాంతో ఈ 2 నెలల పాటు ప్రచారం నిర్వహించడం, అనుచరులను మొయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారనుంది.

ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 19 నుంచే మొదటి దశ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో మే 13న ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే దాదాపు రెండు నెలల టైమ్ ఉంది. దాంతో ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడు కానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో చాలా మంది తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. నెల ముందు నుంచే తమ నియోజకవర్గ పరిధిలో అనుచరులను తీసుకొని క్యాంపెయిన్ చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం లోక్ సభ నియోజకవర్గానికి 95 లక్షలు, అసెంబ్లీ సీటులో 40 లక్షల రూపాయలు మాత్రమే ఒక్కో అభ్యర్థి ఖర్చు పెట్టాలి. కానీ ఈ లెక్కలు కోట్లు దాటిపోతాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 10 నుంచి పాతిక కోట్లు దాకా ఖర్చవుతాయి. లోక్ సభ సీటులో ఒక్కొక్కరికి పాతిక నుంచి 100 కోట్ల దాకా ఖర్చువుతాయి. ఇప్పుడు రెండు నెలల ముందే నగరా మోగడంతో ఇక ఇప్పటి నుంచి భారం భారీగా పెరగనుంది. రోజువారీగా ఏ గ్రామానికి వెళ్ళినా… కనీసం వంద నుంచి 200 మంది కార్యకర్తలు, లీడర్లను వెంటేసుకొని వెళ్లాలి. వాళ్ళకి టీ, టిఫిన్లు, మందు, బిర్యానీ ప్యాకెట్లు, సిగరెట్లు, బీడీలు… ఇలా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లు కలిపి ప్రతి రోజూ లక్షల్లో ఖర్చవుతాయి. ప్రచార వాహనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, మీటింగ్ ల ఖర్చు కూడా ఉంటుంది. ఇప్పటికే పార్టీ ఫండ్ తో పాటు… తమకు టిక్కెట్టు వచ్చేలా సీనియర్లను మేపడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అభ్యర్థులు. దానికి తోడు ఈ రెండునెలల ఖర్చు అదనపు భారం అవుతుందని అభ్యర్థులు లబో దిబో మంటున్నారు.