కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం పవన్ కాకినాడ వెళ్లి అధికారులపై స్థానిక ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. తాజాగా కాకినాడ యాంకరైస్ మరియు సీ పోర్ట్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ పోర్టును కేవలం రేషన్ మాఫి అడ్డాగా చూడకండని విజ్ఞప్తి చేసారు. రేషన్ మాఫియాని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ దానివల్ల 30 వేల మంది పోర్టు కార్మికుల ఇబ్బంది పడుతున్నామని అన్నారు.
కింది స్థాయిలో వీధిలో బైకుల మీద ఆటోల మీద రేషన్ బియ్యం కొనుగోలు చేసే వారిని కట్టడి చేస్తే ఆ బియ్యం పోర్టు వరకు రాకుండా అరికట్టొచ్చు సార్ అలాంటి ప్రణాళికను రూపొందించండని విజ్ఞప్తి చేసారు. ఒక బాబ్జి లోడ్ చేయడానికి 150 మంది కూలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలన్నారు. ఇప్పుడు టోల్గేట్ విధానం వలన ఒక బాబ్జి లోట్ చేసేందుకు సుమారుగా మూడు రోజుల సమయం పడుతుందని తెలిపారు. సగటున్న ఒక కూలీకి మూడు రోజులకు కలిపి 300 రూపాయలు మాత్రమే లభిస్తుంది మేము ఎలా బ్రతకాలి సార్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వీరబాబు నిలదీశారు.
టోల్ గేట్ల వద్ద లారీలు బారులు తీరుతున్నాయి బాధ్యులు నింపేందుకు లారీలు లేక అస్తవ్యస్తాలు పడుతున్నామన్నారు. ఏదో ఒక వ్యక్తి కోసం పూర్తిగా వ్యవస్థని నిలిపివేయకండని కోరారు. 1995 నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతున్నాయన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది వాటి మధ్యలో పిడిఎస్ బియ్యాన్ని బాయిల్డ్ రైస్ ప్యాకింగ్ లో లారీలో వస్తే మాకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే కోట్లు టోల్ గేట్లు విధించడం వలన వ్యాపారస్తులు అందరూ కూడా విశాఖ పోర్టు నుండి తమ వ్యాపారం సాగించుకుంటున్నారని ఉపాధి కోల్పోతున్నామన్నారు.