TDP MLAS: టీడీపీలోనే ధనవంతులైన ఎమ్మెల్యేలు.. ఈ విషయంలో దేశంలోనే నెంబర్ వన్!

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి సంపద మొత్తం కలిపి రూ.1,311 కోట్లు. ఒక టీడీపీ ఎమ్మెల్యే సగటున రూ.69 కోట్ల సంపద కలిగి ఉన్నాడు. ఇది దేశంలోని మిగతా పార్టీల సగటుతో పోలిస్తే ఎక్కువ.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 01:52 PM IST

TDP MLAS: దేశంలోని రాజకీయ పార్టీలు అన్నింటిలోకి అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు టీడీపీలోనే ఉన్నారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి సంపద మొత్తం కలిపి రూ.1,311 కోట్లు. ఒక టీడీపీ ఎమ్మెల్యే సగటున రూ.69 కోట్ల సంపద కలిగి ఉన్నాడు. ఇది దేశంలోని మిగతా పార్టీల సగటుతో పోలిస్తే ఎక్కువ. ద అసోసియేన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), అండ్ ది నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) ఆధ్వర్యంలో దేశంలోని ఎమ్మెల్యేల సంపదను లెక్కించారు.

ఎన్నికల సమయంలో, ఆ తర్వాత దేశంలో ప్రతి ఎమ్మెల్యే తన ఆస్తులు, అప్పులు సహా సంపద విలువను వెల్లడించాల్సి ఉంటుంది. అలా తెలిపిన వివరాల ఆధారంగా ఏడీఈర్, న్యూ.. తాజా నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యేల సగటు సంపద అత్యధికం. దేశవ్యాప్తంగా ఉన్న 1,356 బీజేపీ ఎమ్మెల్యేల సగటు సంపద రూ.11.97 కోట్లు, 719 కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు సంపద రూ.21.97 కోట్లు, 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల సగటు సంపద రూ.23.14 కోట్లు, 103 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు సంపద రూ.14 కోట్లుగా ఉంది. కర్ణాటకలోని మొత్తం 223 ఎమ్మెల్యేల మొత్తం ఆదాయం రూ.14,359 కోట్లు ఉంది. మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.6,679 కోట్లు, ఏపీలోని 174 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.4,914 కోట్లు, తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.1,601 కోట్లుగా ఉంది. అత్యంత సంపద కలిగిన పార్టీల్లో వైసీపీ మూడో స్తానంలో ఉంది.

ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మొత్తంగా రూ.3,379 కోట్లు కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.1,443 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సంపద కలిగిన ఎమ్మెల్యేలు ఉన్న మొదటి మూడు పార్టీలూ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవి వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ. మొత్తం ఆస్తులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 1,356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.16,234 కోట్లు, 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.15,798 కోట్లు, 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.3,379 కోట్లు, 131 మంది డీఎంకే ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,663 కోట్లు, 161 మంది ఆప్ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,642 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 రాజకీయ పార్టీకు చెందిన 4,033 మంది ఎమ్మెల్యేల్లో 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా వీటిని లెక్కగట్టినట్లు ఏడీఆర్ తెలిపింది.